December 3, 2024
SGSTV NEWS
Telangana

Telangana: తస్మాత్ జాగ్రత్త..ఈ నెంబర్ నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయకండి.. చేశారో.. కొంప కొల్లేరే!



సైబర్ నేరగాళ్లు కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్నారు. పోలీసులు వారిపై ఎన్ని చర్యలు తీసుకున్న అసలు తగ్గడం లేదు. తాజాగా మళ్లీ ఓ కొత్త మోసాలతో తెర మీదికి వచ్చారు. మీరు గానుక ఈ ఫోన్ కాల్స్ ఆన్సర్ చేస్తే ఇక అంతే సంగతులు


సైబర్ క్రిమినల్స్ కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ క్రైం పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వీరిలో మాత్రం ఎలాంటి మార్పులు రావడం లేదు. తాజాగా మరో కొత్త తరహా మోసం వెలుగులోకి రావడంతో ప్రజలను సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. విదేశీ నంబర్లతో వచ్చే కాల్స్‌కి స్పందించి వారు చెప్పినట్టు చేస్తే క్రిమినల్ కేసులో ఇరుక్కునే అవకాశం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. వారి ట్రాప్‌లో పడకుండా ఉండేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు అలర్ట్ చుస్తున్నారు.


ఈ నంబర్ల నుండి వచ్చే కాల్స్‌పై తస్మాత్ జాగ్రత్త:

టెల్: +94777455913


టెల్: +37127913091

టెల్: +37178565072

టెల్: +56322553736

టెల్: +37052529259

టెల్: +255901130460

లేదా +371, +375, +381 మొదలైన కోడ్లతో ప్రారంభమయ్యే ఏవైనా నంబర్లు, ఈ వ్యక్తులు ఒక్కసారి కాల్ చేసి, కట్ చేస్తారు. మీరు తిరిగి కాల్ చేస్తే, వారు 3 సెకన్లలో మీ కాంటాక్ట్ లిస్ట్‌ను కాపీ చేసుకోవచ్చు. మీ ఫోన్‌లో బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డు వివరాలు ఉంటే, వాటిని కూడా కాపీ చేయగలుగుతారు.

+375 కోడ్ బెలారస్‌కు

+371 కోడ్ లాట్వియా

+381 కోడ్ సర్వియా

+563 కోడ్ వాల్పరైసో

+370 కోడ్ విల్నియస్

+255 కోడ్ టాంజానియా

ఈ నంబర్లకు జవాబు ఇవ్వకండి లేదా తిరిగి కాల్ చేయకండి. అలాగే, ఎవరైనా కాలర్ మీరు #90 లేదా #09 నంబర్‌ను ప్రెస్ చేయాలని అడిగితే, దానికి స్పందించవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఈ కొత్త ట్రిక్‌తో మీ సిమ్ కార్డును యాక్సెస్ చేసి, మీ ఖర్చుతో కాల్స్ చేయించి, మీపై క్రిమినల్ కేసు వేసేందుకు ఉపయోగిస్తారని తెలిపారు ఈమధ్య ఎక్కువగా వస్తున్న ఇలాంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటే ఈ మెసేజ్‌ని మరింత మందికి షేర్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు

Also read

Related posts

Share via