SGSTV NEWS
CrimeTechnology

Telangana: ఓ చినతల్లి… చావు నిన్ను ఇలా వెంటాడిందా..?

 

పటాన్ చెరు మండలం చిట్కుల్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో కరెంట్ లేకపోవడంతో ఫ్యాన్ కి టవల్ చుట్టి.. అక్క, తమ్ముడు ఆడుకుంటున్నారు. ఈ లోపల ఒక్కసారిగా పవర్ రావడంతో ఉరి పడి.. చిన్నారి చనిపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి.

పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.  ఆడుకుంటున్న సమయంలో ఫ్యాన్‌కు టవల్ చుట్టుకుని.. ఉరి పడి తొమ్మిదేళ్ల చిన్నారి మృతిచెందింది. ఇంట్లో కరెంట్ లేకపోవడంతో అక్క, తమ్ముడు.. ఇంట్లోని ఫ్యాన్‌కు టవల్ చుట్టుకుని ఆడుకుంటున్నారు. ఒక్కసారిగా కరెంట్ వచ్చి..ఫ్యాన్ తిరగడంతో టవల్ చిన్నారి మెడకు చుట్టుకుంది. దీంతో తొమ్మిదేళ్ల సహస్ర అనే చిన్నారి వెంటనే ప్రాణాలు కోల్పోయింది.

ఈ ఘటన జరిగిన సమయంలో సహస్ర తల్లిదండ్రులు ఇంట్లో లేరు. వారు బయట వెళ్లిన సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఇంటికి వచ్చాక పాపను అచేతనంగా చూసి షాకైన కుటుంబ సభ్యులు.. వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు

Also read

Related posts

Share this