.
వీళ్లంతా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. ఈజీ మనీ కోసం అలవాటు పడ్డారు. అమాయకుల ఆధార్ కార్డులను సేకరించి సాఫ్ట్ వేర్ నైపుణ్యంతో ఫోటోలు, అడ్రస్‌లు మార్చేశారు. ఖాతాలో ఓపెన్ చేసి రుణాలు పొంది బ్యాంకులనే బురిడీ కొట్టించారు. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కి అడ్డంగా బుక్కయ్యారు. చివరికి కటకటాల పాలయ్యారు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం కురుమర్తి గ్రామానికి చెందిన కాశమల్ల క్రాంతికుమార్ ఎంబీఏ చదివి హైదరాబాద్ స్వయంగా సాఫ్ట్‌వేర్ కంపెనీ నెలకొల్పాడు. నష్టాలు రావడంతో మూసేశాడు. అదే కంపెనీలో పనిచేసిన సిలివేరు సతీష్‌తో కలిసి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించే ఈజీ మనీ కోసం కొత్త దందాకు తెరలేపారు. నల్లగొండలోని సతీష్ బాబాయ్.. కాశమల్ల నాగరాజుకు కొంత డబ్బు ఇస్తామని చెప్పడంతో అతని ద్వారా తెలిసిన వారి ఆధార్ కార్డులు సేకరించారు.
బ్యాంక్ ఖాతాలు, ఏటీఎం కార్డులతో లోన్స్..
సేకరించిన ఆధార్‌కార్డుల సహాయంతో క్రాంతి కుమార్.. టెక్నాలజీతో పాన్‌కార్డులు, కొత్త సిమ్ కార్డులు తీసుకుని ఫోన్ నంబర్లకు లింక్ చేసి చిరునామాలు మార్చేశాడు. వాటితో వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి పాసు పుస్తకాలు, చెక్ బుక్‌లు, ఏటీఎం కార్డులు తీసుకున్నాడు. నగదు లావాదేవీలు జరిపి సిబిల్ స్కోర్ పెంచుకుని క్రెడిట్ కార్డులతో లోన్స్ తీసుకొని జల్సాలు చేశారు. తీసుకున్న రుణం బ్యాంక్‌లకు తిరిగి చెల్లించకుండా మోసం చేసేవారు. దీంతో బ్యాంకులు అమాయకులైన ఆధార్ కార్డు దారులను రుణాలు చెల్లించాలంటూ ఒత్తిడి చేయడంతో అసలు బాగోతం బయట పడింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ముగ్గురు కేటుగాళ్లను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 27 ఆధార్ కార్డులు, రూ.1,32,600 నగదు, 44 సెల్‌ఫోన్లు, 2 కార్లు, 83 పాన్ కార్డులు, 18 సిమ్ కార్డులు, 92 డెబిట్ కార్డులు, 64 రబ్బర్ స్టాంపులు, 3 ల్యాప్ టాప్‌లు, కలర్ ప్రింటర్ స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025