July 3, 2024
SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: పబ్బులో డీజే వాయించమంటే.. ఇదా మీరు చేసే గలీజు పని..

హైదరాబాద్ పబ్బులపై పోలీస్ నజర్ కొనసాగుతోంది. గత కొంతకాలంగా పబ్బుల్లో డ్రగ్స్ సరఫరా, వినియోగంపై పోలీసులు చాలా సీరియస్‌గా ఉన్నారు. ఈ క్రమంలో డెకాయిట్ ఆపరేషన్ చేస్తూ.. పబ్బుల్లో మత్తు దందా చేసేవారి ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నారు. అయితే ఏకంగా ముగ్గురు డీజేలు కస్టమర్స్‌కు డ్రగ్స్ అమ్ముతున్నట్లు గుర్తించి.. వారిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 15.13 గ్రాముల MDMAను సీజ్ చేశారు. డీజే పార్టీల ముసుగులో వీరు గలీజ్ పనులు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. అదును చూసి రెడ్ హ్యాండెడ్‌గా వారిని అదుపులోకి తీసుకున్నారు.

Also read :తొలుత ప్రమాదం అనుకున్నారు.. కానీ తల్లిదండ్రుల అనుమానమే నిజమైంది..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పలు పబ్బుల్లో రీమిక్స్‌ డీజే నిర్వహించే వ్యక్తులు(డిస్క్ జాకీలు) మాదక ద్రవ్యాలు అమ్ముతున్నట్లు.. పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్ నవీన్‌కుమార్‌ తన ఫోర్స్‌తో కలిసి బంజరాహిల్స్‌లోని పలు పబ్బుల్లో మెరుపు దాడుల చేశారు. తొలుత అఖిల్‌ అనే డిస్క్ జాకీని పట్టుకున్న పోలీసులు.. అతని దగ్గర ఉన్న 2.65 గ్రాముల MDMA డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్‌‌ మూలాల గురించి ప్రశ్నించగా.. ఇబహ్రీంపట్నంకు చెందిన సన్నీ అనే వ్యక్తి సరఫరా చేసినట్లు అఖిల్ తెలిపాడు. ఈ ఇన్ఫర్మేషన్‌తో ఇబ్రహింపట్నంలోని సన్నీ నివాసంలో సెర్చ్ చేయగా.. 12.48 గ్రాముల MDMA లభ్యమైంది. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రాము MDMAను రూ.5000 వేలకు అమ్ముతున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ డ్రగ్స్‌ను బెంగళూర్‌కు చెందిన అలెక్స్‌ తీసుకొని వస్తాడని.. సన్నీ, అఖిల్ కలిసి అమ్మకాలు జరుపుతుంటారని పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్‌తో పాటు 326 గ్రాముల గంజాయిని కూడా వీరి వద్ద నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

Also read :చూడటానికి సంప్రదాయనీ.. పనులు మాత్రం సుద్దపూసనీ తలపిస్తాయి

Related posts

Share via