June 29, 2024
SGSTV NEWS
Crime

ఎక్కడినుంచి వస్తార్రా మీరంతా.. నల్లకోడి, గుమ్మడికాయ, ఎర్రని బొమ్మలు.. మధ్యలో ఆహ్వాన పత్రిక..

తమకు గిట్టని వారికి ఏదైనా చెడు చేయాలనే అక్కసుతో క్షుద్రపూజలు చేయడం వారిపై మంత్రాల ప్రయోగం చేయడం లాంటి ఘటనలను గ్రామీణ ప్రాంతాల్లో చూస్తుంటాం.. కొందరు గిట్టని వారి ఇళ్ల ముందు పూజలు చేసి.. నల్ల కోళ్లు, బొమ్మలు, కుంకుమ, పుసుపు లాంటి వాటిని వేస్తుంటారు.. ఇది చూసి ఏదో జరగుతుందని చాలామంది భయాందోళన చెందుతుంటారు.. తాజాగా.. జరిగిన అలాంటి ఘటన భయాందోళనకు దారితీసింది.. నల్లకోడి, గుమ్మడికాయ, వీటితో పాటు కొన్ని బొమ్మలు.. నిర్మానుష్య ప్రాంతంలో గృహప్రవేశం ఆహ్వానపత్రికకు క్షుద్రపూజలు చేయడం కలకలం రేపింది.. ఇది ఎవరి పని? దీని వెనుకున్న ఉద్దేశాలు? ఏటూరునాగారంలో ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంగపేట మండలం చెరుపల్లిలో ఘటన చోటు చేసుకున్న విచిత్ర ఘటన ములుగు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.. గుర్తు తెలియని వ్యక్తులు ఈర్ష్యతో గృహప్రవేశం ఆహ్వానపత్రికకు క్షుద్రపూజలు చేశారు.

Also read :Telangana: రైతు పొలం చదును చేస్తుండగా బయటపడింది చూసి.. ఒక్కసారిగా ఆశ్చర్యం..

ఏప్రిల్ 6న ఏటూరునాగారంలో నూతన గృహప్రవేశం చేశారు లక్ష్మీ నర్సయ్య – తిరుమల దంపతులు. అయితే గృహప్రవేశ ఆహ్వాన పత్రికకు గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేశారు. నల్లకోడి, గుమ్మడికాయ, బొమ్మలు ఇతర పూజాసామగ్రితో పూజలు చేశారు. ఇది తెలిసి గృహ ప్రవేశం చేసిన కుటుంబంతో పాటు స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఆహ్వాన పత్రికకు ఈ తరహా పూజలు చేయడం ఏంటని స్థానికులు ఆశ్యర్యపోతున్నారు. ఇది ఎవరి పని ఆరా తీసేందుకు యత్నిస్తున్నారు.

Also read :Viral News: కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడటమంటే ఇదే.. ‘చెల్లితో భర్త జంప్‌! భర్త తండ్రితో తల్లి జంప్‌’

Also read :Twin Daughters: పుట్టిన 2 రోజులకే కవల కూతుళ్లను చంపిన తండ్రి! ఎందుకో తెలిస్తే రక్తం మరుగుద్ది..

Related posts

Share via