April 11, 2025
SGSTV NEWS
CrimeTelangana

కామారెడ్డి జిల్లాలో విషాదం.. పెళ్లికి ఒప్పుకోని పెద్దలు, ప్రేమజంట ఆత్మహత్య



ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో వీరు బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహాలను కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించిన పోలీసులు విచారణ చేపట్టారు 

కామరెడ్డి జిల్లా దోమకొండ మండలంలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ జంట ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని కఠిన నిర్ణయం తీసుకున్నారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. పోలీసులు, బంధులవులు తెలిపిన వివరాల ప్రకారం.. దోమకొండ మండలం అంబార్‌పేటకు చెందిన వీణ, కోనాపూర్ గ్రామానికి చెందిన సాయి కుమార్ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోని హాయిగా జీవించాలని ఎన్నో కలలకన్నారు.

పెద్దల వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకురాగ అందుకు వారు ఒప్పుకోలేదు. దీంతో మనస్థాపం చెందిన ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వీణ తన ఇంట్లో దూలానికి ఉరేసుకొని ప్రాణం తీసుకోగా.. సాయి కుమార్ పొలం వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. దీంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు రెండు గ్రామాలకు చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

Also read

Related posts

Share via