October 17, 2024
SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: నగరంలో డ్రగ్స్‎పై ప్రత్యేక దృష్టి.. ఏమాత్రం అనుమానం వచ్చినా..

హైదరాబాద్ మహా నగరం డ్రగ్స్ దందాకు కేంద్ర బిందువుగా మారడంతో పోలీసుల ప్రత్యేక దృష్టి సారించారు. సిటీలోని కొన్ని పబ్‎లు, డ్రగ్ సరఫరదారులు, వినియోదారులకు అడ్డగామారడంతో స్పెషల్ ఫోకస్ పెట్టారు. మంగళవారం అర్థరాత్రి నగరంలోని ప్రధాన జంక్షన్స్‎లో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నగరంలో వీకెండ్ పార్టీలతో కొంత మంది యువతీ, యువకులు చెలరేగిపోతున్నారు. మత్తుకు బానిసై అనేక అకృత్యాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే డ్రగ్స్ పై తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మార్చాలన్నారు. దీనిపై సినిమా ఇండస్ట్రీ వాళ్లకు కీలక సూచనలు చేశారు. డ్రగ్స్ కంట్రోల్ పై కొన్ని అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. అలా చేస్తేనే సినిమాలకు ప్రత్యేక రాయితీలు ఇస్తామన్నారు. దీంతో సినీ పరిశ్రమలోని కొందరు పెద్దలు మందుకు వచ్చి మాదకద్రవ్యాల నియంత్రణ, నిషేధంపై అవగాహన కార్యక్రమాలు కల్పించారు.

Also read :Andhra Pradesh: ఫోటో కోసం ట్రై చేస్తే ప్రాణమే పోయింది.. ఎంత విషాదం..!

తాజాగా కాజాగూడలోని ఒక పబ్‎లో డ్రగ్స్ తీసుకున్న 24 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగంపై పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలోని పలు పబ్బులు డ్రగ్స్‎కు అడ్డగా మారుతున్నదని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో అర్థరాత్రి ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా వారిని వదలకుండా వాహనాలను ఆపి చెక్ చేస్తున్నారు. సంబంధించిన కాగితాలను పరిశీలించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో యువతకు నార్కొటిక్ విభాగంలోని డ్రగ్స్ కంట్రోల్ ఏజెన్సీ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు

Also read :Andhra Pradesh: సీబీఐ నుంచి మాట్లాడుతున్నాం.. మాజీ ఎమ్మెల్యేకు వాట్సప్ కాల్ చేసిన మహిళ.. కట్ చేస్తే, రూ.50లక్షలు..

Related posts

Share via