పెళ్లై 18 ఏళ్లయింది.. ఆయనకు ప్రభుత్వం.. ప్రభుత్వ పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు.. భార్య ఇంట్లోనే ఉంటుంది.. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు.. అంతా బాగానే ఉంది.. భర్త మద్యానికి బానిసయ్యాడని.. అతన్ని చంపితే ఓ కొడుక్కి ఉద్యోగం వస్తుందని ప్లాన్ రచించింది.. దాన్ని ఓ రోజున అమలు చేసి.. ఏం తెలియనట్టు నటించింది.
పెళ్లై 18 ఏళ్లయింది.. ఆయనకు ప్రభుత్వం.. ప్రభుత్వ పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు.. భార్య ఇంట్లోనే ఉంటుంది.. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు.. అంతా బాగానే ఉంది.. భర్త మద్యానికి బానిసయ్యాడని.. అతన్ని చంపితే ఓ కొడుక్కి ఉద్యోగం వస్తుందని ప్లాన్ రచించింది.. దాన్ని ఓ రోజున అమలు చేసి.. ఏం తెలియనట్టు నటించింది.. అయితే.. కొడుకు మృతిపై అనుమానంతో మృతుడు తల్లి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని భార్యే.. భర్తను చంపినట్లు తేలింది.. ఈ షాకింగ్ ఘటన తెలంగాణలోని నల్లగొండలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను నల్లగొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి వెల్లడించారు.
నల్లగొండ పట్టణంలోని పాతబస్తీకి చెందిన ఖలీల్ (44) కనగల్ మండలంలోని చర్లగౌరారంలోని జడ్పీహెచ్‌ఎస్‌లో అటెండర్‌గా పనిచేస్తున్నాడు.. అయితే.. గత నెల 25న మూర్ఛ వచ్చి కిందపడడంతో కుటుంబసభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఖలీల్ చికిత్స పొందుతూ మరణించాడు. ఈ మేరకు అతని భార్య అక్సర్ జహ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలోనే.. తన కొడుకు మృతిపై అనుమానం ఉందని.. దీనిపై విచారణ చేయాలని మృతుడి తల్లి మహ్మద్ బేగం చెప్పడంతో పోలీసులు ఖలీల్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.
అయితే.. మార్చి 7న వచ్చిన పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.. ఖలీల్ తలకు బలమైన గాయమైందని.. దీంతో మృతిచెందినట్లు వైద్యులు నివేదికలో వెల్లడించారు. దీంతో పోలీసులు మృతుడి భార్య అక్సర్ జహను అదుపులోకి తీసుకుని విచారించారు.
2007లో వివాహం జరిగిందని.. ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత భర్త మద్యానికి బానిసై నిత్యం వేధిస్తున్నాడని జహ వెల్లడించింది.. అతని అడ్డు తొలగించుకోవడంతోపాటు తనకు లేదా పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని భావించి ఖలీల్ తలపై కొట్టానని.. నిందితురాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.. కాగా.. ఈఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
Also read
- పోసానికి మరో షాక్ – పీటీ వారెంట్‌తో జైలు నుంచి విడుదలకు బ్రేక్
- చిత్తూరు కాల్పుల ఘటనలో బిగ్ ట్విస్ట్ – దోపిడీకి వ్యాపారి ప్లాన్ –
- పోలీసులకు చుక్కలు చూపించాడు.. తప్పించుకుని ముప్పుతిప్పలు పెట్టిన ఖైదీ!
- Andhra: చోరీ చేసిన సొత్తు ఎక్కడ అంటే.. ఓ చోట గోతాల్లో ఉన్నాయన్నారు.. వెళ్లి చెక్ చేయగా..
- పెళ్లంటే ఇష్టం లేదు.. జీవితంలో ఇంకో స్టెప్ తీసుకోలేను..