SGSTV NEWS
CrimeTelangana

Nalgonda Tragedy: ఫాంహౌస్‌లో గెటు గెదర్‌ ప్లాన్.. సరదాగా ఎంజాయ్‌ చేస్తుండగా.. వెంటాడిన మృత్యువు



వారంతా ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారు. టెన్త్ పూర్తవడంతో అందరూ కలుసుకోవాలనుకున్నారు. ఇందుకోసం దసరా సెలవుల్లో కలిసి ఎంజాయ్ చేయాలని ఓ ఫామ్ హౌస్‌కు వెళ్లారు. అక్కడ స్విమ్మింగ్ పూల్‌లో సరదాగా ఈత కొడుతూ ప్రమాదవశాత్తు ఇద్దరు విద్యార్థులు నీటిలో మునిగిప్రాణాలు కోల్పోయారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుము కుఉన్నాయి.


ఫామ్‌హౌస్‌లో సరదాగా ఎంజయ్‌ చేద్దామని వెళ్లి స్విమ్మింగ్‌ ఫుల్‌లో పడి ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటన నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది. ఫామ్‌హౌస్ యజమాని సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. తర్వాత ఇరు కుటుంబాలకు సమాచారం ఇచ్చారు. విషయం తెలసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. చేతికొచ్చిన కొడుకులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెటు పగిలేలా రోధించారు.

వివరాల్లోకి వెళ్తే..నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో కొందరు విద్యార్థులు చదువు పూర్తి చేసుకున్నారు. వీరంతా ప్రస్తుతం హైదరాబాద్ లోని వేర్వేరు కళాశాలల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. అయితే దసరా సెలవుల నిమిత్తం సొంతూళ్లకు వచ్చిన వీరంతా కలుసుకోవాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం నార్కెట్ పల్లి మండలం జువ్విగూడెంలోని ఓ ఫామ్ హౌస్‌లో 13 మంది విద్యార్థులు గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకున్నారు. సాయంత్రం వరకు ఎంజాయ్ చేశారు. ఇక ఈత కొడదామని రిషిక్, హర్షవర్ధన్ తోపాటు మరో ఇద్దరు ఫాంహౌస్ లోని స్విమ్మింగ్ ఫుల్లోకి దిగారు.

రిషిక్‌కు సరిగ్గా ఈత రాకపోవడంతో అందులో మునిగి పోయాడు. దీంతో రిషిక్‌ను కాపాడేందుకు యత్నించగా హర్షవర్ధన్ కూడా మునిగిపోయాడు. వాళ్లు ఎంతకీ బయటకు రాకపోవడంతో వారి స్నేహితులు విషయాన్ని వెంటనే ఫాంహౌస్ వద్ద పనిచేస్తున్న వ్యక్తికి చెప్పారు. దీంతో అతను ఫామ్ హౌస్ యజమానితో పాటు పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో ఇద్దరు విద్యార్థులను స్విమ్మింగ్ ఫుల్ నుంచి బయటికి తీయగా అప్పటికే వారు మృతిచెందారు.

ఇక మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. మృతులు నార్కట్ పల్లికి చెందిన నాగరాజు, స్వాతి దంపతుల పెద్ద కుమారుడు రిషిక్ (17), చౌటుప్పల్ పట్టణానికి చెందిన పోలోజు శ్రీను పెద్ద కొడుకు హర్షవర్ధన్(17)గా పోలీసులు గుర్తించారు

Also read

Related posts