చిన్న చిన్న నేరాలు చేసి కొందరు జైలు పాలయ్యారు. వీరిలో పరివర్తన మాట దేవుడెరుగు.. కుటుంబ సభ్యులను కూడా దొంగలుగా మార్చారు. కుటుంబ సభ్యులే కాదు.. బంధువులందరూ కలిసి రెండు ముఠాలుగా ఏర్పడ్డారు. ఇంకేముంది. పాఠశాలలకు కన్నం వేశారు. పట్టుబడిన నిందితులంతా ఒకే కుటుంబ సభ్యులు, బంధువులేనని తెలిసి పోలీసులు నోరెళ్ల బెట్టారు. నల్గొండ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్ధులకు కంప్యూటర్ పరిజ్ఞానం, డిజిటల్ క్లాస్సెస్ విద్యను అందించే ఉద్దేశముతో రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకొచ్చింది. పాఠశాలలకు కంప్యూటర్ పరికరాలతోపాటు వాటి నిర్వహణకు విలువైన బ్యాటరీలను అందజేసింది. ఈ బ్యాటరీలు నల్గొండ జిల్లాలో గత కొంత కాలంగా వరుసగా చోరీలకు గురవుతున్నాయి. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారుల ఫిర్యాదులపై నల్గొండ జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ దృష్టి సారించారు.
Also read :ఇదొక రాంగ్ కాల్ ప్రేమ కథా చిత్రం.. పెళ్లైందన్నా వదలని యువతి.. చివరకు..
కుటుంబ సభ్యులు బంధువులంతా దొంగలే..
నల్లగొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన గోపాగాని జగన్, ఆవుల తిమ్మయ్య, ఆవుల సంజీవ, నాగిళ్ళ నాగారాజు.. వీరిలో కొందరు చిన్న చిన్న దొంగతనాలు చేసి గతంలో జైలు పాలయ్యారు. జైలుకెళ్ళినా పరివర్తన రాకపోగా తమ కుటుంబ సభ్యులను కూడా దొంగలుగా మార్చారు. బంధువులతో కలిపి రెండు ముఠాలుగా ఏర్పడ్డారు. ఈ ముఠాల్లో పదిమంది మహిళలు కూడా ఉన్నారు. చిన్నచిన్న దొంగతనాలు చేసే అలవాటున్న ఈ ముఠాలు ప్రభుత్వ స్కూళ్లపై కన్నేసింది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని కట్టంగూరు, శాలిగౌరరం, కేతేపల్లి, నకిరేకల్, తిప్పర్తి, మాడ్గులపల్లి, సూర్యాపేట జిల్లాలోని చివ్వేంల, ఆత్మకూరు ఎస్, అర్వపల్లి మండలాల్లోని 17 ప్రభుత్వ పాఠశాలల్లో చోరీలు చేశాయి. రాత్రికి రాత్రే పాఠశాలల్లోని డిజిటల్ క్లాసులకు సంబంధించిన విలువైన బ్యాటరీలను మాయం చేశాయి. శాలిగౌరరం నుంచి నకిరేకల్ మీదుగా హైదరాబాద్‌కు వెళ్తున్న TS 01 UA 2466 గల నెంబర్ ట్రాలీ ఆటోని పోలీసులు తనిఖీ చేశారు. బ్యాటరీ లోడ్‌తో పట్టుబడిన ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా.. రెండు ముఠాల బాగోతం బట్టబయలైంది. ఈ ముఠాల నుంచి 17 నేరాలకు సంబంధించిన 7.18 లక్షలవిలువైన 100 బ్యాటరీలు, ట్రాలీ ఆటో, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని నల్లగొండ డిఎస్పి శివరాంరెడ్డి తెలిపారు. రెండు ముఠాల్లోని నిందితులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారితో పాటూ సమీప బంధువులేనని డిఎస్పి చెప్పారు. రెండు ముఠాలకు చెందిన 14 మంది నిందితులు పరారీలో ఉన్నారని ఆయన చెప్పారు. ఇందులో పదిమంది మహిళలు కూడా ఉన్నారని ఆయన చెప్పారు.
Also read :కర్నూల్ జిల్లాలో దళిత మహిళను ట్రాక్టర్తో తొక్కించి హత్య చేసిన దారుణసంఘట….
రతనాల సీమలో రక్తపాతం.. మహిళలే లక్ష్యంగా దారుణాలు.. హత్యకు కారణాలివే..
పెళ్లై ఏడాది గడవక ముందే.. ఆ కారణంతో వివాహిత షాకింగ్ నిర్ణయం
చూడ ముచ్చటైన జంట.. పెళ్లైన రెండు వారాలకే ఘోరం.. అసలు ఏం జరిగిందంటే?