SGSTV NEWS
CrimeTelangana

తెల్లారినా ఇంట్లో నుంచి బయటకు రాని తల్లికూతురు.. అసలేమైందని పక్కింటి వారు చూడగా..

ఒంటరితనం భరించలేక తల్లి కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది.. గ్రామానికి చెందిన లావణ్య అనే వివాహిత గత ఆరు నెలల క్రితం బావిలో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే ఆమె మృతికి అత్త, ఆడపడుచు, భర్త కారణం అంటూ బంధువులు ఫిర్యాదు చేశారు.. దీంతో అత్త తలారి పోచమ్మ, ఆడపడుచు ఎల్లవ్వతో పాటు కుమారుడిపై కేసు నమోదు అయింది. ఈ కేసు విషయంలో కుమారుడు జైలుకు వెళ్లివచ్చాడు.. అప్పటినుంచి కుమారుడు తన పిల్లలతో సహా హైదరాబాద్ నగరానికి బతుకు తెరువు కోసం వెళ్ళి.. పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు..


కుమారుడు వెళ్లడంతో.. ఇంట్లో తలారి ఎల్లవ్వ, తలారి పోచమ్మ తల్లి కూతురు.. ఇద్దరే నివాసం ఉంటున్నారు. వీరితో ఇరుగు పొరుగు వారు సైతం మాట్లాడకపోవడంతో గత కొంతకాలంగా మనస్థాపనతో ఉన్నారు. ఈ క్రమంలోనే.. ఒంటరితనం భరించలేక గతరాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

ఉదయం వేళ చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రామాయంపేట ఆసుపత్రికి తరలించారు.


కుమారుడు తలారి ముత్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Also read

Related posts