మరో వైపు ఆర్టీసీ అధికారులు సైతం గ్రామానికి చేరుకొని బస్సును పరిశీలించారు. బస్సును తగులబెట్టేందుకు ప్రయత్నించిన వారి ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తు్న్నారు.
నల్గొండ జిల్లాలో ఆర్టీసీ బస్సు దగ్ధమైన ఘటన కలకలం రేపింది. మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామంలో ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టారు గుర్తు తెలియని దుండగులు. జులై 22 అర్ధరాత్రి దాటిన తరువాత ఆర్టీసీ బస్సుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. కాలిపోయిన బస్సు మిర్యాలగూడ డిపోకు చెందిన TS05Z0047 నంబర్‌గా గుర్తించారు. రోజువారీగా తడకమళ్ల గ్రామంలోని ప్రధాన బస్‌స్టాప్ కూడలిలో నైట్‌హాల్ట్ కోసం పార్క్ చేసి ఉంచారు. ఈ క్రమంలోనే గుర్తుతెలియని ఆకతాయిలు బస్సు వెనుక భాగంలో నిప్పు అంటించడంతో మంటలు చెలరేగాయి. స్థానికుల ఆరోపణల ప్రకారం, ఈ ఘటనకు తాగుబోతులు లేదా గంజాయి బ్యాచ్ పనిగా అనుమానిస్తున్నారు.
స్థానికుల సమాచారం మేరకు మిర్యాలగూడ రూరల్ సీఐ పీఎన్‌డీ ప్రసాద్, ఎస్‌ఐ లక్ష్మయ్య సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మరో వైపు ఆర్టీసీ అధికారులు సైతం గ్రామానికి చేరుకొని బస్సును పరిశీలించారు. బస్సును తగులబెట్టేందుకు ప్రయత్నించిన వారి ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తు్న్నారు
Also read
- Varalakshmi Vratam: శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తారు? తేదీ, శుభ సమయం, ప్రాముఖ్యత
- రాత్రివేళల్లో పూజలందుకునే…వారాహి దేవత
- నేటి జాతకము..24 జూలై, 2025
- Andhra Pradesh Video: గొర్రెల కాపరులపై గొడ్డలితో దాడి… పొలంలోకి గొర్రెలు వచ్చాయని దారుణం
- Telangana: అరేయ్ ఏంట్రా ఇది.. వాట్సప్‌లో ఎమోజీ పెట్టినందుకు కొట్టి చంపారు.. సూర్యాపేటలో దారుణం..