November 22, 2024
SGSTV NEWS
Trending

Video: హైదరాబాద్ నగరంలో ప్రత్యక్షమైన సాగర కన్యలు! పూర్తి వివరాలు ఇవే..

Mermaids, Hyderabad: తరచూ సాగర్ కన్యల సంబంధించి ఏదో ఒక వార్త వస్తునే ఉంటుంది. అయితే ఈ సారి ఏకంగా హైదరాబాద్ నగరంలో జల కన్యలు ప్రత్యక్షమయ్యారు. అంతేకాక వింతైన ప్రదర్శనతో ఈ మత్స్య కన్యలు అందరిని ఆకట్టుకుంటున్నారు. మరి.. ఆ వివరాలు

చాలా సినిమాల్లో కూడా సాగర కన్యల గురించి చూపించారు. అలానే సాగర కన్యలు గురించి అప్పుడప్పుడు వార్తలు వస్తుంటాయి. అంతేకాక సాగర్ కన్యల  మాదిరిగా కనిపించే ఆకారలకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంటాయి. వారి ఫోటోలను చూసినప్పుడు అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. తాజాగా సాగర, మత్స్య కన్యల గురించి ఓ వార్త వచ్చింది. హైదరాబాద్ నగరంలో మత్స్య కన్యలు ప్రత్యక్షమయ్యారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

హైదరాబాద్ నగరంలో సాగర్ కన్యలు ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. దేశంలోనే తొలిసారి కూకట్‎పల్లిలో ఏర్పాటు చేసిన అండర్ వాటర్ సొరంగ ఎగ్జిబిషన్ మెర్మైడ్ షో వావ్ అని అనిపించేలా ఆకట్టుకుంటుంది. సాగర కన్యల జల ప్రదర్శనలో అరుదైన చేపల ప్రదర్శన స్కూబా డ్రైవింగ్ వంటి వినూత్న ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. దీంతో ఈ ఎగ్జిబిషన్ కి వచ్చి.. నగరవాసులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కథల్లో, సినిమాల్లో చూపించే సాగర కన్యల ప్రదర్శన మాత్రం దేశంలోనే మొట్టమొదటిసారి ఇక్కడ ఏర్పాటు చేసినట్లు నిర్వహకులు చెబుతున్నారు.

ఇక్కడ ఎగ్జిబిషన్ లో ప్రదర్శన  కోసం పసిఫిక్ మహాసముద్రంలో ప్రదర్శనలు చేసే ఆరుగు యువతులను నగరానికి తీసుకొచ్చారు. వీరందరూ ఫిలిప్పీన్‎కు చెందిన వారు. మెర్మైడ్‎గా పిలుచుకునే వీరు సాగర కన్య డ్రెస్సింగ్‎తో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రత్యేక డ్రెస్ లో 8 వేల చదరపు అడుగుల విస్ట్రీర్ణం‎లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అంతర్భాగ నీటి సోరంగంలో ఆక్సిజన్ లేకుండా స్విమ్మింగ్ చేస్తూ ప్రదర్శన  చేస్తున్నారు. ఈ ఇలా వారు చేసే ప్రదర్శన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గతంలో దుబాయ్, థాయిలాండ్, హాంకాంగ్ లాంటి దేశాల్లో మాత్రమే ఈ షోలు ప్రదర్శించబడేవి. కానీ దేశంలోనే మొట్టమొదటిసారిగా భాగ్యనగరంలో ఈ షో నిర్వహించడంతో సందర్శకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

ఈ షో కోసం ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 600 అరుదైన చేపలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడ స్కూబా డ్రైవింగ్ కూడా మంచి అనుభూతిని ఇస్తుంది. మరో నెల రోజులపాటు ఈ ఎగ్జిబిషన్ ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతోందంట. సాగర కన్యల ప్రదర్శన మాత్రం  రోజూ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటుందని తెలిపారు. పూర్తి షో కి సంబంధించిన టికెట్ ధరలను తెలిపారు. పెద్దవాళ్ళకి రూ. 150, పిల్లలకి రూ.120 ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. మొత్తంగా నగర వాసులు ఈ ఎగ్జిబిషన్ ద్వారా ప్రత్యేక అనుభూతి పొందవచ్చని పలువురు అభిప్రాయా పడుతున్నారు.

https://x.com/AduriBhanu/status/1793700067683246489?t=FfKzoFONWg0r_j3dU69cgg&s=19

Also read

Related posts

Share via