తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ తీవ్ర కలకలం రేపింది. MBBS ఫస్టియర్ స్టూడెంట్‌ను ముగ్గురు సీనియర్లు ర్యాగింగ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదుతో ఇటు కాలేజీ అధికారులతోపాటు.. నాగర్‌కర్నూలు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ యాక్షన్ చేపట్టారు.
తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ తీవ్ర కలకలం రేపింది. MBBS ఫస్టియర్ స్టూడెంట్‌ను ముగ్గురు సీనియర్లు ర్యాగింగ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదుతో నాగర్‌కర్నూలు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ యాక్షన్ చేపట్టారు. వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన దీపక్‌శర్మ అనే విద్యార్థి నాగర్‌కర్నూలు జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో MBBS మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో.. ఈ నెల 25న సాయంత్రం వేళ హర్షవర్ధన్, లోకేష్, హిమవర్ధన్ అనే ముగ్గురు సీనియర్లు.. దీపక్‌శర్మను వాళ్ల హాస్టల్ రూమ్‌కు పిలిపించి ర్యాగింగ్ చేయడం తీవ్ర దుమారం రేపింది. ర్యాగింగ్ పేరుతో ముగ్గురు సీనియర్లు.. దీపక్‌శర్మపై దాడి చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మెడికల్ కాలేజీ హాస్టల్‌కు తీసుకెళ్లి ర్యాగింగ్ చేశారని.. గోడ కుర్చీ వేయించడంతోపాటు.. లేని గ్యాస్ సిలిండర్‌ను ఉన్నట్లు ఫీలవుతూ మోయాలని అవహేళన చేసినట్లు తెలిపాడు.
అయితే.. సీనియర్ల టాస్క్‌ను మధ్యలో ఆపేసినందుకు లెదర్ బెల్ట్‌తో దాడి చేశారని వెల్లడించాడు. ముఖంపై పిడిగుద్దులు గుద్దడంతో నోటి నుంచి రక్తం బయటకు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు.. మొబైల్ ఫోన్ లాక్కొని పర్సనల్ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకొని ముగ్గురు సీనియర్లు బ్లాక్ మెయిల్ చేశారని దీపక్ శర్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం సంచలనం సృష్టించింది. బాధితుడి కంప్లైంట్‌తో ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ర్యాగింగ్ ఆరోపణలపై మెడికల్ కాలేజ్‌కు వెళ్లి ఆరా తీశారు.
అటు.. ర్యాగింగ్ ఘటనపై నాగర్‌కర్నూలు మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ సుగుణ రియాక్ట్ అయ్యారు. ర్యాగింగ్ విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే కాలేజ్ ప్రిన్సిపల్ అడిషనల్ ఎస్పీకి సమాచారం ఇచ్చారని తెలిపారు. ర్యాగింగ్ చేసిన విద్యార్థులు, బాధితుడిని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు వెల్లడించారు. ర్యాగింగ్ చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా.. పండుగ నేపథ్యంలో వచ్చే నెల2న వస్తామని చెప్పినట్లు తెలిపారు. మెడికల్ కాలేజ్‌లో ర్యాగింగ్ ఘటనలను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేదిలేదని వైస్ ప్రిన్సిపల్ సుగుణ స్పష్టంచేశారు
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025