June 29, 2024
SGSTV NEWS
CrimeTelangana

తెలంగాణ : ఇంటి ఓనర్ కొడుకుతో 27 ఏళ్ల వివాహిత జంప్.. సీన్ కట్ చేస్తే..!

ఇద్దరి మధ్య కొన్ని రోజులుగా సాన్నిహిత్యం ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ బాలునితో ఎక్కడికైనా వెళ్ళిపోవాలని ఉద్దేశంతో అతన్ని బలవంతంగా ఒప్పించింది. బాలుడి ఇంట్లో ఉన్న డబ్బులు బంగారం తెప్పించుకుంది.

పదహారేళ్ల ఓ మైనర్ బాలుడితో 27 ఏళ్ల వివాహిత వెళ్లిపోయింది. సిద్ధిపేట పట్టణంలో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయంగా మారింది. సోలంకి అనే 27 ఏళ్ళ యువతి భర్త పిల్లలతో కలిసి సిద్దిపేట పట్టణం హనుమాన్ నగర్‌లో గత మూడేళ్లుగా నివాసముంటోంది. అద్దెకు ఉంటూ ఆ ఇంటి యజమాని కొడుకు 16 సంవత్సరాల మైనర్ బాలుడిపై మనసు పారేసుకుంది. తన మాయ మాటలతో బాలుడిని లోబరుచుకుంది. ఆ బాలునితో బలవంతంగా శారీరకంగా అవసరాలు తీర్చుకుంది. కుర్రాడు కొన్ని రోజుల కిందట నుంచి కనిపించకుండాపోయాడు. నాటి నుంచి అతడి ఇంటి పక్కనే ఉంటున్న ఓ వివాహిత కూడా కనిపించడంలేదు. కుర్రాడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఇద్దరి మధ్య కొన్ని రోజులుగా సాన్నిహిత్యం ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ బాలునితో ఎక్కడికైనా వెళ్ళిపోవాలని ఉద్దేశంతో అతన్ని బలవంతంగా ఒప్పించింది. బాలుడి ఇంట్లో ఉన్న డబ్బులు బంగారం తెప్పించుకుంది. తన భర్త పిల్లలను అక్కడే వదిలేసి బాలున్ని తీసుకుని చెన్నై వెళ్ళింది. ఆ బాలుడి తల్లి తన కొడుకు కనిపించడం లేదని, నిందితురాలపై అనుమానం ఉన్నదంటూ సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది.

ఈ దర్యాప్తు చేపట్టిన పోలీసులు టెక్నాలజీ ద్వారా సదరు మహిళ నిందితురాలు చెన్నైలో ఉన్నట్లు తెలిసింది. పోలీసులు వెతుకుతున్నారన్న విషయం తెలుసుకున్న బాధితురాలు ఎలాగైనా దొరికిపోతామని, జూన్ 11వ తేదీన బాలుని తీసుకువచ్చి సిద్దిపేటలో వదిలివేసింది. దీంతో సదరు బాలుడిని పోలీసులు విచారణ చేపట్టడంతో అసలు వ్యవహారం బయటపడింది. బాలుడిని చెన్నై తీసుకువెళ్ళిన మహిళ.. ఒక రూమ్ అద్దెకు తీసుకుని అక్కడే ఉంచింది. తనపై బలవంతంగా శారీరకంగా కలవమని బలవంతం పెట్టినట్టు బాలుడు పోలీసులకు వివరించాడు. ఇక, వెంట తీసుకుని వెళ్ళిన డబ్బులు ఖర్చయిన తర్వాత చెన్నైలోనే గుర్తు తెలియని వ్యక్తులకు బంగారం అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేసినట్టు వెల్లడించాడు. దీంతో సదరు మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసలు పోక్సో కేసు నమోదు చేసి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్టు సిద్ధపేట టూ టౌన్ ఇన్స్‌పెక్టర్ ఉపేందర్ తెలిపారు

Related posts

Share via