February 24, 2025
SGSTV NEWS
CrimeTelangana

Telangana: ఉదయాన్నే పోలీసుల ఎంట్రీ.. భార్య ముందే భర్తను అలా.. చివరికి ఆమె ఏం చేసిందంటే

ప్రేమకు దగ్గరై… రక్త సంబంధానికి దూరమైంది ఆ మహిళ. తల్లితండ్రులను ఎదురించి మతాంతర వివాహం చేసుకుంది. భర్త విసిగించినా.. పోనీలే మారతాడు అని ఊరుకుంది. కానీ భర్త మితిమీరిన పనులకు ఆమె సహనం కోల్పోయింది. తనలో లేని కసాయితనాన్ని పుణికిపుచ్చుకుని.. ఆ వివరాలు ఇలా


అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులను కాదని ఉన్నత విద్యను అభ్యసిస్తున్న తరుణంలో అనూహ్యంగా పరిచయమైన వ్యక్తిని నమ్మి తన జీవితాన్ని అర్పించుకున్నది. ఏ విద్యార్హత ఆర్థిక స్తోమత లేకున్నా తన మనసుకు నచ్చిన వాడిని మతాచారం అడ్డొచ్చినా రక్త బంధాన్ని తెంచుకొని మరీ నమ్మించిన వాడిని మనవాడి జీవనం సాగిస్తోంది. సుఖ సంతోషాలతో కొనసాగిన జీవితాన్ని వదిలి కష్టాలు నష్టాలు పడుతూ దాంపత్య జీవనాన్ని కొనసాగిస్తూ ఈ బంధంతో పుట్టిన ఇరువురు బిడ్డలను సాకుతూ తన గుండె అంతరాల్లో కొనసాగుతున్న బడబాగ్నిని సైతం లెక్కచేయకుండా జీవనం సాగిస్తున్న సౌమ్యురాలు ఈమె.. భర్త వ్యవహారం తరచూ బాధించినా తాను మారుతాడు అన్న నమ్మకం జీవనాన్ని సాగిస్తూ వస్తుంది. ఆమె నమ్మకం మరో మారు వమ్మైంది. చివరకు భర్త చేసిన నేరంపై విచారణకు పిలవడంతో ఆత్మాభిమానం కలిగిన ఈ బిడ్డ తనువు చాలించేందుకు సిద్ధమై తన కడుపున పుట్టిన బిడ్డలను కడతేర్చి తాను తనుపు చాలించింది. ఈ హృదయ విదారకమైన సంఘటన మధిర మండలం నిదానపురంలో జరిగింది.

నిదానపురం గ్రామానికి చెందిన షేక్ జానీతో షేక్ ప్రేజా(28)(మారిన పేరు) ఐదేళ్ల క్రితం మతాంతర ప్రేమ వివాహాన్ని చేసుకుంది. హైదరాబాద్‌లో ఉన్నత చదువులు చదువుతున్న సమయంలో పరిచయమైన బాజీ చెప్పిన మాయమాటలను నమ్మి తల్లిదండ్రులు వద్దని వారించినా.. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అతను తన ముస్లిం సంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. అతని కోసం కనిపెంచిన తల్లి తండ్రులు, కుటుంబాన్ని వదులుకొని అతనితో కలిసి నడిచింది. పెళ్లికి ముందే భర్త చెడు అలవాట్లు, వ్యసనాలకు బానిసగా మారి దొంగతనాలకు పాల్పడుతూ ఉండేవాడు. ఆ విషయాన్ని ఆమెకు చెప్పలేదు. పెళ్లి తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టడంతో కుటుంబ పోషణ భారమైంది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. అతను భార్యకు తెలియకుండా బయటకు వెళ్లి దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఆధారాలతో ఇంటికి వచ్చి పోలీసులు అతన్ని విచారణకు రమ్మని తీసుకొని వెళ్ళారు. ఈ విషయాన్ని భార్యకు చెప్పడంతో అవమాన భారంతో కుమిలిపోయింది. మృతురాలు తన ఇరువురు పిల్లలు మెహక్,(4) మెనురూల్(3)లను దగ్గరికి తీసుకొని తనలో లేని కసాయితనాన్ని ప్రదర్శించి వారిరువురిని ఉరి వేసి కడతేర్చింది. అదే క్రమంలో ఇంట్లో దూలానికి చీరతో ఉరివేసుకొని తనూ ఆత్మహత్య చేసుకొంది. ఈ విషాద ఘటన స్థానికులను కలచి వేసింది. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మధిర పోలీసులు.

Also read

Related posts

Share via