SGSTV NEWS
CrimeTechnology

Telangana: ఎంతో భవిష్యత్ ఉన్న సహస్త్ర ఎలా చనిపోయింది..?



మంచిర్యాలలోని మిమ్స్ జూనియర్ కాలేజీలో విషాదం చోటు చేసుకుంది. అనుమతులు లేకుండా మూడో అంతస్తులో ఏర్పాటు చేసిన హాస్టెల్‌లో నుంచి పడి బైపీసీ సెకండియర్ విద్యార్థిని సహస్ర మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కాలేజీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మిమ్స్ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న కొత్తపల్లి సహస్త్ర అనే విద్యార్థిని అనుమానస్పద స్థితిలో మృతి‌చెందడం కలకలం రేపుతోంది. కళాశాల భవనం మూడవ అంతస్తు పైనుంచి అనుమానస్పద స్థితిలో కింద పడి విద్యార్థిని‌ సహస్త్ర తీవ్రంగా గాయపడింది. కళాశాల సిబ్బంది హుటాహుటిన ఆమెను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా విద్యార్థిని మార్గమధ్యలో మృతి చెందింది. ఈ కాలేజీ భవనం నిర్మాణంలో ఉండటం.. అధికారిక అనుమతులు రాకముందే కళాశాల నిర్వహిస్తున్నట్టుగా గుర్తించామన్నారు సంఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఇంటర్మీడియట్ అధికారి అంజయ్య.

విద్యార్థిని మృతిపై అనుమానాలున్నాయంటూ తెలిపారు మృతిరాలి బందువులు, విద్యార్థి సంఘాల నాయకులు. మృతురాలు స్వస్థలం మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మున్సిపాలిటీ లోని శివాలయం వీధిగా గుర్తించారు. నిర్మాణం పనులు పూర్తి కాకుండానే హాస్టల్ , క్లాస్ నిర్వహించడంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విద్యార్థిని ప్రమాదానికి కారకులైన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు‌

Also read

Related posts

Share this