పిల్లలకు మంచి, చెడ్డలు నేర్పించాల్సిన తల్లే దారి తప్పింది ప్రవర్తించింది. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ తల్లి చేసిన పాడు పనికి కన్న కొడుకు మనో వేదనకు గురయ్యాడు. తెలిసిన వారు సూటి పోటి మాటలతో మరింత బాధపెట్టడంతో తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించి సోదరి తమ్ముడిని కాపాడుకునేందుకు హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ఎలాంటి లాభం లేకపోయింది. చివరి క్షణాల్లో తన ఆవేదనను వీడియోలో క్రియేట్ చేసి ఆ యువకుడు ప్రాణాలు వదిలాడు. వీడియో చూసిన పలువురు కన్నీరు పెడుతున్నారు.
ఓ తల్లి చేసిన పాడు పనికి కన్న కొడుకు మనో వేదనకు గురయ్యాడు. తెలిసిన వారు సూటి పోటి మాటలతో మరింత బాధపెట్టడంతో తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్తించిన సోదరి తమ్ముడిని కాపాడుకునేందుకు హుటాహుటిన ఆస్పత్రికి తరలించింది.. కానీ ఎలాంటి లాభం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆ యువకుడు తనువు చాలించాడు. చివరి నిమిషంలో తన చావుకు తన తల్లి , తల్లితో వివాహేతర సంబందం పెట్టుకున్న ఆ వ్యక్తే కారణం అంటూ తన ఆవేదనను చెప్పుకున్నాడు. ఈ మేరకు మరణ వాగ్మూలం ఇచ్చి తుదిశ్వాస విడిచాడు. ఆ యువకుడి మృతిని జీర్ణించుకోలేని తోటి స్నేహితులు, కుటుంబ సభ్యులు అనుమానితుడి ఇంటిపై దాడికి దిగారు. ఇంటికి నిప్పటించి మృతదేహాంతో ఆందోళన చేపట్టారు. ఈ దారుణ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గంగారాం గ్రామానికి చెందిన దుర్కి అనిల్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్యహత్యకు పాల్పడ్డాడు. తన తల్లి రాజేశ్వరి అదే గ్రామానికి చెందిన మూడపల్లి తిరుపతి అనే వ్యక్తితో వివాహేతర సంబందం పెట్టుకుందని.. ఈ విషయం తెలిసిన దగ్గరి బంధువులు ప్రశ్నించడంతో మనోవేదనకు గురైన అనిల్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన సోదరి అనిత కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో అనిల్‌ను వెంటనే మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి అనిల్ మృతి చెందాడు.
చికిత్స పొందుతున్న చివరి సమయంలో తన ఆత్మహత్య యత్నానికి కారణం తన తల్లి రాజేశ్వరి, తిరుపతి లంటూ మరణ వాగ్మూలం ఇచ్చాడు. అనిల్ మృతికి కారణమైన తిరుపతిని అరెస్ట్ చేయాలంటూ అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు మృతదేహాంతో తిరుపతి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. అంతటితో ఆగకుండా తిరుపతి ఇంటి పై దాడిచేసి ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనతో అలర్ట్ అయిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఆందోళనకారులను అడ్డుకున్నారు. పోలీసులు నచ్చ చెప్పడంతో నాలుగు గంటల ఆందోళన అనంతరం మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!