SGSTV NEWS
CrimeTelangana

Telangana: పెళ్లి కావడం లేదని జీవితాన్ని అర్థాంతరంగా ముగించిన యువకుడు



పెళ్లి చేసుకుని మంచి భాగస్వామితో దాంపత్య జీవితం గడపాలన్నది అతని ఆశ. కానీ ఎన్ని సంబంధాలు చూసినా కుదరడం లేదు. మరోపక్క వయసు ఏమో పెరిగిపోతుంది. దీంతో ఆ యువకుడు విరక్తితో ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణలో ఈ ఘటన వెలుగుచూసింది. ..


పెళ్లి చేసుకోడానికి వధువు దొరకడం లేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.  రాజన్న సిరిసిల్ల జిల్లా యెల్లారెడ్డిపేట మండలంలో ఈ ఘటన వెలుగుచూసింది. మే 7 బుధవారం 23 ఏళ్ల యువకుడు వధువు దొరకకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. బాధితుడిని గొర్రెల కాపరిగా పనిచేసే ఒగ్గు మహేష్‌గా గుర్తించారు. అందుతోన్న సమాచారం ప్రకారం మహేష్ చాలా సంవత్సరాలుగా తగిన వివాహ బంధం కోసం వెతుకుతున్నాడు.  కానీ తనకు నచ్చిన వధువు దొరకలేదు. తన పరిస్థితిపై ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారని సమాచారం. దీంతో జీవితంపై విరక్తి చెంది బుధవారం గ్రామ శివార్లలోని ఒక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహేష్ తల్లి రాజవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

Also read

Related posts

Share this