April 11, 2025
SGSTV NEWS
CrimeTelangana

పాతబస్తీలో మహిళలను జుగుప్సాకరంగా తాకుతూ వికృత చేష్టలు.. నిందితుడిని వెంటాడిన స్థానికులు

హైదరాబాద్ పాతబస్తీ ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. మహిళలను అసభ్యంగా తాకుతూ ఓ వ్యక్తి పారిపోతున్నాడు. మొఘల్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్‌ షాహి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. జూలై 25న ఓ మహిళ తన ఇంటి వరండాలోనే బట్టలు ఆరేసుకుంటుండగా.. ఓ కామాంధుడు ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమెను అసభ్యంగా తాకాడు. దీంతో ఆ మహిళ గట్టిగా కేకలు వేయడంతో.. అక్కడి నుంచి బైక్‌పై పారిపోయాడు నిందితుడు. అయితే ఇంట్లోనే ఉన్న ఆమె భర్త.. ఆ నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. స్థానికులు కూడా అతడి వెంట పరిగెత్తారు. కాని బైక్‌పై స్పీడ్‌గా వెళ్లిపోయాడు ఆ కామాంధుడు.

Also read :Andhra Pradesh: చూడ్డానికి జెంటిల్ మెన్‌లా ఉన్నాడనుకుంటే పొరపాటే.. ఏం చేశాడో తెలిస్తే మైండ్ బ్లాంకే

దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీని సేకరించారు. అయితే ఈ వీడియోలు వాట్సాప్‌లలో వైరల్‌ అయ్యాయి. చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్లే గ్యాంగ్‌ హైదరాబాద్‌లోకి ప్రవేశించిందంటూ పుకారు షికారు చేసింది. కానీ పోలీసులు క్లారిటీ ఇస్తూ.. దీని వెనుక ఘటనను వెలుగులోకి తెచ్చారు. సౌత్‌జోన్‌ డీసీపీ స్నేహ మెహరా.. ఈ ఇష్యూని సీరియస్‌గా తీసుకున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామన్నారు మొఘల్‌పురా సీఐ దుర్గాప్రసాద్‌

Also read :Cyber Fraud: ఫోన్‌లోనే సంప్రదింపులు.. ఆన్‌లైన్‌లో నియామకాలు.. కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్ళు..!

దుర్గమ్మ గుడిలో చోరీ.. హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు, సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవిగో..

Hyderabad: టైర్‌ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. అవుటర్‌పై ఆరేళ్ల బాలుడు మృతి..

Related posts

Share via