నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో 15 నెలల బాలుడు అయాన్ష్ ప్రాణాలు కోల్పోయాడు. జ్వరం కారణంగా ఆస్పత్రికి తీసుకెళ్ళిన బాలుడికి IV క్యానులా ద్వారా చికిత్స ప్రారంభించగా, క్యానులా సరిగ్గా సెట్ కాక శరీరంలో ఇన్‌ఫెక్షన్ ఏర్పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అత్యవసర చికిత్స కోసం నిర్మల్ తరలిస్తుండగా ..
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. 15 నెలల చిన్న బాలుడు అయాన్ష్ ప్రాణాలు కోల్పోయాడు. బాలుడికి జ్వర లక్షణాలు కనిపించడంతో తల్లిదండ్రులు అతన్ని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సిబ్బంది IV క్యానులా ద్వారా సెలైన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే త క్యానులా సరిగ్గా సెట్ అవ్వక బాలుడి శరీరంలో ఇన్‌ఫెక్షన్ ఏర్పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు సమర్ధమైన చికిత్స ఇవ్వకుండా.. చేతులు ఎత్తేశారని తెలిపారు.
బాలుడిని అత్యవసర చికిత్స కోసం నిర్మల్ వైపు తరలిస్తుండగా, మార్గమధ్యలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. వైద్యుల నిర్లక్ష్యమే తమ బిడ్డ మృతికి కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషాద ఘటనపై బాలుడి బంధువులు ఖానాపూర్‌లో ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. సరైన వైద్య సదుపాయాలు లేకుండా బాలుడి ప్రాణాలు తీశారని రోదిస్తున్నారు.
స్థానికులు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భద్రత, చిన్న పిల్లల కోసం సమగ్ర వైద్య నిర్వహణ అవసరమని కొందరు అధికారులు సూచించారు.
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!