బూర్గంపాడు మండలం సారపాకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యానికి బానిసై సైకోల మారిన భర్త, భార్య పిల్లలపై దాడులకు పాల్పడ్డాడు. కన్న కూతురు కాలితో తంతూ విచక్షణారహితంగా కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పోలీసుల దృష్టికి చేరడంతో నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
బూర్గంపాడు మండలం సారపాకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యానికి బానిసై సైకోల మారిన భర్త, భార్య పిల్లలపై దాడులకు పాల్పడ్డాడు, కన్న కూతురును కాళ్ళతో తన్నుతూ విచక్షణారహితంగా కొట్టాడు. కూతురుపై దాడి చేస్తున్న దృశ్యాలను తల్లి సెల్ ఫోన్లో చిత్రీకరించింది. ఈ వీడియోలు కాస్త అతను విధులు నిర్వహిస్తున్న ఐసీడీఎస్ అధికారుల దృష్టికి చేరాయి. మానవత్వం మరిచి కన్నకూతురిపై తండ్రి చేస్తున్న దాష్టికాన్ని చూసి అధికారులు షాక్ అయ్యారు. వీడియో ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళితే.. బూర్గుంపాడు మండలం సారపాకకు చెందిన మిరియాల రమేష్ బాబు స్థానికంగా ఉన్న ఐసీడీఎస్‌లో విధులు నిర్వహిస్తూ జీవితం సాగిస్తున్నాడు. ఈయనకు భార్య పిల్లలు ఉన్నారు. అయితే గతకొన్ని రోజులుగా బెట్టింగ్ అవాటు పడిన రమేష్ బాబు బెట్టింగుల ద్వారా జూదమాడి అప్పుల పాలయ్యాడు, ఈ క్రమంలోనే మద్యానికి బానిసై ఇంట్లో భార్య పిల్లలను మానసికంగా శారీరకంగా వేధింపులకు గురిచేయడం స్టార్ట్ చేశాడు. దీంతో భార్య భర్తల మధ్య తరచూ విబేధాలు కూడా వచ్చాయి. ఈ విషయంపై పెద్ద మనుషుల సమక్షంలోనూ పలుమారు పంచాయతీ నిర్వహించినా అతని వ్యవహార శైలిలో మార్పు రాలేదు.
గత కొంతకాలంగా తాను ఏం చేస్తున్నానో అనే విషయం కూడా మర్చిపోయి మద్యం మత్తులో తన కూతురిపై అనేకసార్లు దాడి చేసేవాడు, అడ్డుకున్న భార్యను కూడా విచక్షణ రహితంగా కొట్టేవాడు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం కూడా మద్యం మత్తులో ఇంటికి వచ్చిన రమేష్ బాబు గొడవ పెట్టుకొని తన కూతురిని మానవత్వం మరచిపోయి కాళ్లతో తన్నుతుండగా తల్లి వీడియో తీసింది. దీంతో అతని నిజ స్వరూపం బయటపడింది, ఆ వీడియో ఐసిడిఎస్ అధికారులకు చేరడంతో పిల్లలపై తండ్రి రమేష్ బాబు చేస్తున్న దాష్టీకం గురించి తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రమేష్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025