ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చంద్రాయపాలెంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోడు భూముల వివాదంలో గిరిజనుల మధ్య నెలకొన్న వివాదం కాస్తా.. పోలీసుల జోక్యంతో రణరంగంగా మారింది. (మార్చి 31) ఆదివారం ఉదయం సత్తుపల్లి మండలం చంద్రయపాలెం, బుగ్గపాడు గ్రామాల లో పోడు భూముల వివాదం నెలకొనడం తో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలను సంప్రదించారు..రెండు గ్రామాల గిరిజనుల మధ్య వివాదం నడుస్తుండగా పోలీసులు అటవీ ప్రాంతంలోకి ఎంటర్ అయ్యారు.
గొడవపడుతున్న ఇరువర్గాల గిరిజనులకు సర్ది చెప్పే ప్రయత్నంలో సత్తుపల్లి టౌన్ సిఐ కిరణ్ ఒక గిరిజనుడి ఫోన్ లాక్కుని గిరిజనుడు ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు ..దీంతో గిరిజనులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు గిరిజనుల పై దాడి చెయ్యడంతో గిరిజనులు ఎదురు తిరిగారు పోలీసులపై దాడి చేసి కొట్టారు..సిఐ కిరణ్ పై కర్రలతో దాడి చేశారు…సిఐ కు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు చెల్లాచెదురుగా పారిపోయారు. సంఘటన స్థలం నుంచి వెళ్లి పోవడంతో గొడవ సద్దుమణిగింది అనుకున్నారు. అంతలోనే పోలీస్ బలగాలు, ఫారెస్ట్ బలగాలు అక్కడ భారీగా మోహరించారు. బుగ్గపాడు లోని గిరిజనుల పై విరుచుకు పడ్డారు..వారిపై లాఠీ ఛార్జి చేసి 20 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ సంఘటనలో గిరిజనులకు తీవ్ర గాయాలయ్యాయి. పలువురి తలలు పగిలి తీవ్ర రక్త స్రావం జరిగింది. చంద్రయపాలెం గ్రామం బుగ్గపాడు గ్రామాలకు చెందిన గిరిజనులు పొడు భూముల వివాదం కాస్తా ముదిరి…పోలీసులు జోక్యం చేసుకోవడం తో పోడు వివాదం కాస్త రెండు గ్రామాల మధ్య ఉద్రిక్తత వాతావరణం కు దారితీసింది. ఇప్పటికీ ఇంకా రెండు గ్రామాలలో పోలీస్ బలగాలు చక్కర్లు కొడుతున్నాయి. సత్తుపల్లి సిఐ కిరణ్ పై దాడి చేసిన కొందరు గిరిజనులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Also read
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
- పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే
- Andhra: కడుపునొప్పితో మైనర్ బాలిక ఆస్పత్రికి.. ఆ కాసేపటికే..
- విజయవాడలోని ఈ ప్రాంతంలో భయం..భయం.. ఎందుకో తెలిస్తే అవాక్కే..
- అప్పులపాలైన వ్యక్తిని.. అయ్యో పాపమని చేరదీసిన వృద్ధురాలు.. ఏం చేశాడో తెలుసా?