February 3, 2025
SGSTV NEWS
CrimeTelangana

Telangana: ఉద్యోగాలన్నారు.. నియామక పత్రాలు ఇచ్చారు.. తీరా ఆఫీసుకి వెళ్లగా..

మిర్యాలగూడకు చెందిన వంశీకి హోంగార్డు ఉద్యోగ ఇప్పిస్తామని 12 లక్షల రూపాయలు వసూలు చేశారు. మరో ముగ్గురి వద్ద రూ.6 లక్షల చొప్పున డబ్బులు తీసుకున్నారు. హోంగార్డులు, కాంట్రాక్ట్, ఏఎన్ఎం, ఆపరేటర్‌ పోస్టులు ఇప్పిస్తానంటూ నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన మొత్తం తొమ్మిది మంది నిరుద్యోగుల నుంచి రూ.45.10 లక్షలు వసూలు చేశారు.



ఈజీ మనీ కోసం కేటుగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అక్రమాలకు తెర తీస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను నిండా ముంచేస్తున్నారు. ఉద్యోగాలను ఎరగా వేస్తూ అందినకాడికి దోచేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ మోసమే మిర్యాలగూడలో వెలుగు చూసింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన రాళ్లపల్లి శ్రీధర్‌ స్థానిక విద్యానగర్‌లో రెండేండ్ల కింద గ్రామీణ ఉద్యోగ సేవా కేంద్రం ఏర్పాటు చేశాడు. హైదరాబాద్ కు చెందిన ఖాసీంకు రియల్ఎస్టేట్ వ్యాపారం చేసే ఏపీ రాష్ట్రం నంద్యాలకు చెందిన రాసపుత్ర రాఘవేందర్ అలియాస్ రాజు, హైదరాబాద్ కు చెందిన ఎడ్ల చంద్రయ్య, మిర్యాలగూడకు చెందిన రాళ్లపల్లి శ్రీధర్ తోపాటు మిర్యాలగూడకు చెందిన రాళ్లపల్లి నారాయణ, రాళ్లపల్లిపార్వతమ్మలతో పరిచయం ఏర్పడింది. మీరంతా కలిసి జాబ్ లు ఇప్పించే ఏజెన్సీ బ్రాంచ్ ను ఏర్పాటు చేసుకోవాలని, అందుకు పర్మిషన్ ఇప్పిస్తానని ఖాసీం ఒప్పించాడు. జాబ్ కోసం వచ్చే వారి వద్ద డబ్బులు వసూలు చేస్తే అందులో 10శాతం కమీషన్ ఇస్తానని ఆశ చూపించాడు.


దీంతో మిర్యాలగూడకు చెందిన వంశీకి హోంగార్డు ఉద్యోగ ఇప్పిస్తామని 12 లక్షల రూపాయలు వసూలు చేశారు. మరో ముగ్గురి వద్ద రూ.6 లక్షల చొప్పున డబ్బులు తీసుకున్నారు. హోంగార్డులు, కాంట్రాక్ట్, ఏఎన్ఎం, ఆపరేటర్‌ పోస్టులు ఇప్పిస్తానంటూ నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన మొత్తం తొమ్మిది మంది నిరుద్యోగుల నుంచి రూ.45.10 లక్షలు వసూలు చేశారు. వీరందరికీ కాంట్రాక్ట్ మాన్ పవర్ ఏజెన్సీ జాబ్ పేర నియామక పత్రాలను ఇచ్చారు. వారంతా ఎంతో సంతోషంగా ఉద్యోగాల్లో చేరేందుకు ఆయా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లారు. తీరా అక్కడికి అవి ఫేక్ ఆర్డర్లు అని తెలుసుకున్నారు.





ఉద్యోగాల పేరుతో మోసపోయామని తెలుసుకొన్న వంశీ అనే బాధితుడు మిర్యాలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి రాఘవేందర్, శ్రీధర్ లను అరెస్టు చేశారు. నిందితుల రూ.లక్ష నగదు, రెండు స్మార్ట్ ఫోన్లు, నిరుద్యోగుల బయోడేటా దరఖాస్తులను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. త్వరలో మిగిలిన నిందితులను కూడా పట్టుకుంటామని ఆయన చెప్పారు

Also read

Related posts

Share via