భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు తరచూ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే..! 2014 నుండి గోషామహల్ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ కు అనేకసార్లు ఇతర దేశాల నుండి బెదిరింపు కాల్స్ వచ్చేవి. సంబంధం లేని నెంబర్లు, సంబంధం లేని వ్యక్తులు పదేపదే ఫోన్లు చేసి తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని పలుమార్లు రాజాసింగ్ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఎన్నికల సమయంలోనూ రాజాసింగ్ కు బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తిని ట్రేస్ చేసేందుకు పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు రాజాసింగ్ కు ఫోన్ చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వసీంగా గుర్తించారు పోలీసులు. ఉద్యోగరీత్యా దుబాయ్ లో స్థిరపడ్డాడు వసీం. రాజా సింగ్ ఫిర్యాదు తర్వాత ఆ ఫోన్ నెంబర్లను ఆధారంగా చేసుకుని సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా బెదింపు కాల్స్ వస్తున్న నంబర్ దుబాయ్ నుండి ఆపరేట్ అవుతున్నట్లు గుర్తించారు. అతడి లొకేషన్ ఆధారంగా వివరాలను ఆరా తీశారు హైదరాబాద్ పోలీసులు. మహమ్మద్ వసిం దుబాయ్‌లో ఉంటూ రాజాసింగ్‌కు పదే పదే ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడ్డట్టు పోలీసలు నిర్ధారించారు. ఒక ఫోన్ నెంబర్ తో కాకుండా దాదాపు పదికి పైగా ఫోన్ నెంబర్లను మారుస్తూ ఉపయోగించినట్టు తేలింది. నిరంతరం రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ చేసి వేధింపులకు గురి చేశాడు వసీం. ఈ వ్యవహారంపై పోలీసులకు రాజాసింగ్ ఫిర్యాదు పలు మార్లు ఫిర్యాదు చేశాడు.. దీంతో వసీంను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు.
వసీం ఎలా పోలీసులకు ఎలా చిక్కాడు..?
దుబాయ్ లో ఉంటున్న వసీంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు హైదరాబాద్ పోలీసులు. వసీం పై గతంలోనే లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అతడు ఎప్పుడు ఇండియా వచ్చిన పోలీసులకు వెళ్లే విధంగా హైదరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టడంతో ఎట్టకేలకి వసీంను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లుకౌట్ నోటీసుల కారణంగా దుబాయ్ నుండి హైదరాబాద్‌కు వచ్చిన వెంటనే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించారు. వసీంను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత పది సంవత్సరాలుగా ఒక వర్గానికి వ్యతిరేకంగా రాజాసింగ్ వ్యాఖ్యలు చేస్తున్నారని అందుకోసమే రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ చేసేవాడినని పోలీసులు విచారణలో వసీం ఒప్పుకున్నట్టు సమాచారం.
Also read
- సినిమా రేంజ్ లో భూ కబ్జాకు యత్నం.. కాని చివరిలో బిగ్ ట్విస్ట్ ?
- Balcony Collapse: పంజాగుట్ట లో విషాదం.. శ్రీవాత్స అపార్ట్మెంట్ బాల్కనీ కూలి ఇద్దరు మృతి
- శ్రీరామ నవమి ఎప్పుడు? తేదీ, పూజా సమయం ఇదే!
- శ్రీరామ నవమికి ముందే చేయాల్సిన పుణ్యకార్యం.. సమస్యలు తొలగి సకల శుభాలు!
- వీరిది ఏం జాతకం రా బాబు.. ఏం చేసినా చేతినిండా డబ్బే డబ్బు!





