July 3, 2024
SGSTV NEWS
CrimeTelangana

రూ. 18 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు.. 11 నిమిషాల్లో రీఫండ్.. అదెలా సాధ్యంమంటే..

హైదరాబాదులో సైబర్ క్రైమ్ భారీన పడుతున్న బాధితుల సంఖ్య రోజుకు పెరుగుతుంది. సగటున గంటకు ముగ్గురు బాధితులు సైబర్ నేరస్తుల బారినపడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. వివిధ మార్గాల్లో స్కామ్‎లకు పాల్పడుతున్న సైబర్ నెరగాళ్లు నెలకి కోట్ల రూపాయలను కాజేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‎కు చెందిన ఒక యువకుడు రూ.18 లక్షలు సైబర్ నేరస్తుల బారిన పడి పోగొట్టుకున్నాడు. అంబర్ పేట్ ప్రాంతంలో నివాసం ఉండే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి జూన్ 17న తనకి ఫెడెక్స్ నుండి ఒక కాల్ వచ్చింది. తన పేరు మీద ఒక పార్సల్ వచ్చిందంటూ నమ్మించారు. ఆ వెంటనే మరొక నెంబర్ నుండి ముంబై పోలీసుల పేరుతో కాల్ చేశారు. మీ పేరు మీద ఇల్లీగల్‎గా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని కేసు నమోదు చేసినట్లు బాధితుడుని నమ్మించారు. బాధితుడు ఆధార్ కార్డు వివరాలు తెలుసుకున్న నిందితులు తనను మరింత భయభ్రాంతులకు గురి చేసేలా నటించారు. ముంబై నుండి ఇరాన్‎కు తన పేరు మీద డ్రగ్స్ కొరియర్ అవుతున్నట్లు బాధితుడిని భయపెట్టారు.

Also read :అర్థరాత్రి పెరట్లోకి చొరబడిన దొంగలు.. చివరకు వాటిని కూడా వదల్లేదు..

ఇదంతా స్కైప్ వీడియో కాల్‎లో మాట్లాడిన సైబర్ నేరగాళ్లు.. తాము చెప్పినట్లు చేస్తే కేసు నుండి తప్పిస్తామని బెదిరించారు. ఒక నకిలీ ఎఫ్‎ఐ‎ఆర్‎ను సైతం చూపించారు. తమ అకౌంట్‎కి డబ్బులు పంపిస్తే ఆర్బీఐ నిబంధనల ప్రకారం వెరిఫై చేసి తిరిగి డబ్బులను వాపసిస్తామని బాధితుడిని నమ్మించారు. వీరి మాటలను నమ్మిన బాధితుడు తన వద్ద రూ.18 లక్షల రూపాయలు లేవని కేటుగాళ్లకు చెప్పాడు. దీంతో సైబర్ నేరగాళ్లు ఒక నకిలీ ఆర్బీఐ నోటిఫికేషన్ సైతం తయారుచేసి బాధితుడికి పంపించారు. దీంతో భయపడిపోయిన బాధితుడు తన ఫోన్ నుండి లోన్ అప్లై చేసి రూ.18 లక్షల రూపాయలు తీసుకున్నాడు. సైబర్ నిందితులు చెప్పిన అకౌంట్‎కి ఆ రూ.18 లక్షలు బదిలీ చేశాడు. డబ్బులు పంపగానే వారి కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు నేరుగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

Also read :Telangana: మద్యం మత్తులో స్కూలుకు వచ్చిన టీచర్.. తరగతి గదిలో పిల్లలు ఏం చేశారో తెలుసా..?

గురువారం సాయంత్రం 06:58 గంటలకు బాధితుడు నుండి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. నిమిషాల వ్యవధిలో కేసు ఛేదించారు. డ్యూటీ కానిస్టేబుల్ శ్రీకాంత్ నాయక్ ఎస్సీఆర్పీ పోర్టల్‎లో ఆన్లైన్లో ఫిర్యాదు చేశాడు. వెంటనే ఐసిఐసిఐ బ్యాంకు సిబ్బందితో మాట్లాడి బాధితుడు అకౌంట్ నుండి ట్రాన్స్ఫర్ అయిన రూ.18 లక్షలను రాత్రి 7.09 గంటలకు బ్లాక్ చేయించారు. 11 నిమిషాల వ్యవధిలో ఈ ఆపరేషన్స్ సక్సెస్ కావడంతో దర్యాప్తు చేసిన కానిస్టేబుల్ శ్రీకాంత్‎ను ఉన్నతాధికారులు అభినందించారు.

Also read :ఇంత దుర్మార్గమా.. భార్యకు పురుగుల మందు తాగించి.. చేతిని అడ్డుపెట్టి

Related posts

Share via