ఎంత అవగాహన కల్పించినా సరే చాలా మంది ఇప్పటికింకా సైబర్ నేరస్తుల ట్రాప్‌లో పడి మోసపోతున్నారు. అప్పు ఇవ్వు, వేధించు, పీడించు. ఫోన్లు చేసి బండబూతులు తిట్టు. మార్ఫింగ్ ఫొటోలతో అందరిముందు అవమానించు. మానసికంగా కుంగదీసి లొంగదీసి రుణం వసూల్ చేయడమే..! దానికోసం ఎంత దారుణాలకైనా పాల్పడు. ఎంత నేరానికైనా ఘోరానికైనా దుర్మార్గానికైనా ఒడిగట్టు. అప్పు తీసుకుంటే ఆత్మహత్య చేసుకోవాల్సిందేనా? హైదరాబాద్ శివారు పేట్ బషీరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు అప్పు తీసుకొని పెళ్లిరోజు నాడే ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.
తెలుగు రాష్ట్రాల్లోనే లోన్‌యాప్ మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. రకరకాల యాప్‌ల్లో నిత్యం ఏదో అవసరాల నిమిత్తం రెండు, ఐదు, పదివేలు తీసుకుంటారు. నరకకూపంలో పడిపోతారు. ఇన్‌టైమ్‌లో పేమెంట్ చేసినా..వాళ్లు మాత్రం వదలరు.. నాన్‌స్టాప్ టార్చర్ పెడుతూనే ఉంటారు. ఈ క్రమంలోనే పేట్‌బషీరాబాద్‌లో నివసించే ఓ యువకుడు పది రోజుల క్రితం రెండు వేల రూపాయలు లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నాడు. తిరిగి చెల్లించే వ్యవధి ఒక వారం. రూ. 2000 చిన్న ఆన్‌లైన్ రుణం కోసం లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు మొదలయ్యాయి. అతని భార్య ఫొటోలు మార్ఫింగ్ చేసి వేధించడంతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు బాధితుడు.
లోన్ యాప్ ద్వారా తీసుకున్న రెండు వేల రూపాయలు తిరిగి చెల్లించకపోవడంతో అతని భార్యకు నోటిఫికేషన్ పంపించారు. ఆమె మొదట్లో పట్టించుకోలేదు. అయితే, ఆ తర్వాత వాట్సాప్ ద్వారా మార్ఫింగ్ చేసిన న్యూడ్ ఇమేజ్ రావడంతో ఆమె నివ్వెరపోయింది. రుణ దరఖాస్తు ప్రక్రియలో యువకుడు షేర్ చేసిన కారణంగా నిందితుడు ఆమె ఫోటోను పొందాడు. మార్ఫింగ్ చేసిన ఇమేజ్ రావడంతో .. పంపినవారిని సంప్రదించడానికి ఆమె ప్రయత్నించింది. కానీ సమాధానం రాలేదు. అదే చిత్రాన్ని సంపత్‌కు కూడా పంపారు.
ఈ నేపథ్యంలో, రుణం తిరిగి చెల్లించాలని, లేకుంటే మరింత పరువు తీస్తానని ఆమెకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఈ మెసేజ్‌లు అన్ని అంతర్జాతీయ కోడ్ +92 (పాకిస్తాన్)తో కూడిన నంబర్ నుండి వచ్చాయి. చివరికి సదరు మహిళ తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లగా, యువకుడు మాత్రం వారి నివాసంలోనే ఉన్నాడు. వేధింపులను భరిస్తూ వచ్చారు. కానీ, అధికారికంగా ఫిర్యాదు చేయలేదు. ఈ క్రమంలోనే పెళ్లిరోజు ఆమె తల్లిదండ్రుల ఇంటికి వస్తానని చెప్పి ఫోన్ చేశాడు యువకుడు. కానీ ఆ మరుసటి రోజు, అతను విషాదకరంగా ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మరణానంతరం, లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులే అతని ఆత్మహత్యకు కారణమని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం