సెల్‌ఫోన్ కోసం ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన మహానగరంలో వెలుగులోకి వచ్చింది. గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లర్ నెంబర్ 65 వద్ద ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని నిందితులు
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం రాత్రి 11 గంటల 30 నిమిషాల ప్రాంతంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై పిల్లర్ నెంబర్ 65 వద్దకు వచ్చారు. రోడ్డు పక్కనే వ్యాపారం చేసుకుంటున్న సన ఉల్లా వద్దకు వచ్చి, సెల్‌ఫోన్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీంతో సనావుల్లా ఇవ్వకపోవడంతో ప్రతిఘటించారు. మొబైల్ ఫోన్ ఎంతకీ ఇవ్వకపోవడంతో తమ వద్ద తెచ్చుకున్న కత్తితో సనావుల్లాపై పలుమార్లు దాడి తెగబడ్డారు దుండగులు. ఈ ఘటనలో ఛాతిపై ఎక్కువ గాయాలయ్యాయి. ఆ తర్వాత బాధితుడి వద్ద ఉన్న సెల్‌ఫోన్ తీసుకుని పరారయ్యారు.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న బాధితుడు సనా ఉల్లాను సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యలు ధ్రువీకరించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు గుడిమల్కాపూర్ పోలీసులు. అయితే ఆ గుర్తు తెలియని నిందితులు ఎవరు మొబైల్ కోసమే వీరి మధ్య ఘర్షణ జరిగిందా పాతకక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.
Also read
- ప్రియుడి కోసం ఇల్లు వదిలి.. పోలీసుల చేతిలో..!
- రథ సప్తమి విశిష్టత
- భార్యపై అనుమానం.. బాయ్ ఫ్రెండ్ ఇంటికెళ్లి బ్యాగ్‌తో బయలుదేరిన భర్త.. ఆ తర్వాత..
- AP Crime: కన్న కూతురికి చిత్రహింసలు…వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే!
- తిరుపతిలో భారీ చోరీ.. కిలోల బంగారం గోవిందా