SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: భర్త ఆటోడ్రైవర్.. మరో వ్యక్తితో భార్య ఆ యవ్వారం.. అర్థరాత్రి గుట్టుగా ఏం చేసిందంటే..



నిరంతరం తనను అనుమానంతో వేధించడంతోపాటు.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. భార్య.. భర్తను దారుణంగా హత్య చేసింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ షాకింగ్ ఘటన కలకలం రేపింది. బంధువుల ఫిర్యాదుతో భార్యను అరెస్టు చేసిన పోలీసులు.. జైలుకు పపించారు.. ఈ ఘటన హైదరాబాద్ లో కలకలం రేపింది.

నిరంతరం తనను అనుమానంతో వేధించడంతోపాటు.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. భార్య.. భర్తను దారుణంగా హత్య చేసింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ షాకింగ్ ఘటన కలకలం రేపింది. మీర్‌పేట్ ప్రాంతానికి చెందిన 34 ఏళ్ల అలంపల్లి సంద్య తన భర్తను ఉరి తీసి హత్య చేసింది.. ఆ తర్వాత దాన్ని సహజ మరణంగా చిత్రీకరించింది.. ఈ క్రమంలో బంధువుల అనుమానంతో.. కథ అడ్డం తిరిగింది.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. విజయ్‌కుమార్, సంధ్య దంపతులు మీర్‌పేట్ జిల్లెల్లెగూడలోని సాయినగర్‌లో నివాసం ఉంటున్నారు. మీర్‌పేట్ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో సంధ్యా స్వీపర్‌గా పనిచేస్తుండగా, ఆమె భర్త అలంపల్లి విజయ్‌కుమార్ (42) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.. విజయ్‌కుమార్ తరచూ మద్యం తాగి భార్యపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వేధించేవాడు. ఆమె ఒక సహోద్యోగి జీవన్‌తో సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

అయితే.. అక్టోబర్‌ 20వ తేదీ రాత్రి కూడా ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. కోపోద్రిక్తురాలైన సంధ్య మొదట దుప్పట్టాతో భర్త గొంతు నొక్కి, అనంతరం తాడుతో ఉరి వేసి చంపినట్టు విచారణలో వెల్లడైంది. అనంతరం భర్త బాత్రూమ్ దగ్గర అపస్మారక స్థితిలో పడిపోయాడని నటించింది. ఆసుపత్రికి తరలించగా, విజయ్‌కుమార్‌ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు.

మొదట ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా పోలీసులు నమోదు చేశారు. అయితే, బాధితుడి సోదరుడు ఫిర్యాదు చేయడంతో కేసు మలుపు తిప్పుకుంది. ఆ తర్వాత విచారణలో హత్య, సాక్యాధారాలు మార్చినట్లు పోలీసులు తెలిపారు. విజయ్‌కుమార్‌ తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదుతో.. పోలీసులు విచారణ చేయగా.. అతన్ని సంద్య హత్య చేసినట్లు ఒప్పుకుంది. తన కొత్త సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కోపంతో ఆమె .. భర్తను చంపినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితురాలి ఇల్లు నుంచి హత్యకు ఉపయోగించిన తాడు, దుపట్టా స్వాధీనం చేసుకున్నారు.

ప్రస్తుతం సంద్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమెను సోమవారం నాడు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెను 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.

Also read

Related posts