June 29, 2024
SGSTV NEWS
CrimeTelanganaViral

Viral Video: సికింద్రాబాద్‌లో ఘోరం.. సిగ్నల్ జంప్‌ చేయబోయాడు! కట్ చేస్తే రోడ్డుపై పల్టీలు..



సికింద్రాబాద్‌లోని జేబీఎస్‌ సిగ్నల్ వద్ద గురువారం (జూన్‌ 6) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాఫిక్‌ సిగ్నల్‌ జంప్‌ చేసేందుకు యత్నించిన కారు మరో కారును ఢీకొట్టింది. అనంతరం రోడ్డుపై పల్టీలు కొట్టుకుంటూ తిరగబడింది. కంటోన్మెంట్‌ సికింద్రాబాద్‌ క్లబ్‌ వద్ద ఈ రెండు కార్లు ఢీకొన్నాయి. అసలేం జరిగిందంటే….

గురువారం ఉదయం సికింద్రాబాద్‌ క్లబ్‌ వద్ద సిగ్నల్‌ పడిన సమయంలో రోడ్డు దాటుతున్న నల్లని కియా కారెన్స్ కారు.. మరోవైపు నుంచి అడ్డుగా వచ్చిన మరో తెల్లని టొయోటా ఇన్నోవా కారును వేగంగా ఢీకోట్టింది. దీంతో అదుపుతప్పిన కియా కారు రోడ్డుపై మూడు సార్లు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్, స్థానికులు హుటాహుటిన కారులో చిక్కుకున్న వారిని రక్షించి సురక్షితంగా బయటకు తీశారు. ప్రమాదానికి గురైన కారులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం గాయాలపాలైన డ్రైవర్‌తోపాటు కారులోని ఇతర ప్రయాణికులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

40-సెకన్ల వీడియో క్లిప్‌లో సిగ్నల్‌ పడుతుందన్న తొందరలో కియా కేరెన్స్ కారు డ్రైవర్‌ కారును వేగంగా నడపడం సీసీటీవీ ఫుటేజీలో చూడొచ్చు. సిగ్నల్‌ పడటంలో మరోవైపు నుంచి వచ్చిన కారును అది వేగంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాధంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

https://x.com/AduriBhanu/status/1798794952497090779?t=2iyXBgEqQ9HjQ7RQ-yhU2A&s=19



Also read

Related posts

Share via