పని కోసం వచ్చిన మైనర్ బాలికపై ఓ కామాంధుడు కన్నేశాడు. మైనర్ బాలికను బెదిరించి పలుమార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఎవరికైనా చెప్తే చంపుతానని బెదిరించాడు. దీంతో భయపడిన ఆ బాలిక ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచి పెట్టింది. దీంతో తన శరీరంలో వచ్చిన మార్పులు గమనించిన తల్లిదండ్రులు బాలికను నిలదీశారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. అప్పటికే ఐదు నెలల గర్భం దాల్చింది బాలిక. దీంతో కంగుతిన్న తల్లిదండ్రులు ఆ కామాంధుడిపై శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన తండ్రితో కలిసి పనికి వెళ్లిన గిరిజన బాలికపై ఓ కామాంధుడు కన్నేశాడు. బెదిరించి మరీ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. దాదాపు 5 నెలలు గడిచిన తర్వాత ఈ విషయం బయటకు తెలియడంతో బాలిక కుటుంబ సభ్యులను బెదిరించి బాలికకు అబార్షన్ చేయించాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు డబ్బుకు లొంగక పోలీసులను ఆశ్రయించారు. శంషాబాద్ మండలంలోని ఓ తండాకు చెందిన బాలిక తన తండ్రితో సమీప గ్రామంలో పలుకుబడి ఉన్న ఓ వ్యక్తి భూమిలో వ్యవసాయ పనులకు వెళ్తోంది. ఆమెపై కన్నేసిన యజమాని అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
అతడికి భయపడిన బాలిక ఇన్ని రోజులు విషయం చెప్పకపోవడంతో ఐదు నెలల గర్భం దాల్చింది. ఆ తర్వాత బాలికను యజమాని కొత్తూరుకు తీసుకువెళ్లి ప్రాణానికి ముప్పు ఉంటుందని తెలిసిన డబ్బులు ఇచ్చి మరి గర్భస్రావం చేయించాడు. అనంతరం ఈ విషయం తెలియడంతో తన వ్యవసాయ క్షేత్రంలో గ్రామ పెద్దలు తండావాసులను కూర్చోబెట్టి రాజీ ప్రయత్నం చేశారు. స్థానికంగా ఉన్న కొంతమంది జేబులో డబ్బులు నింపి, తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేశాడు. చివరికి జరిగిన ఘోరం భరించలేక తల్లిదండ్రులు శంషాబాద్ పోలీసులు ఆశ్రయించారు. జరిగిన దారుణం అంతా పోలీసులకు వివరించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025