SGSTV NEWS
CrimeTelangana

RTC Bus Conductor: పండగపూట దారుణం.. ఆర్టీసీ బస్సు కండక్టర్ ఆత్మహత్య..! ఏం జరిగిందో?



తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం బోనాల పండగ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఓ వైపు పండగ వాతావరణం నెలకొంటే.. హైదరబాద్ నగరంలో ఈ రోజు తెల్లవారు జామున ఆర్టీసీ బస్సు కండక్టర్ మృతదేహం ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించింది. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది..


హైదరాబాద్, జులై 20: ఆర్టీసి బస్సు కండక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడకు చెందిన జి శ్రీనివాస్ (51) 7 నెలల నుంచి ఉప్పల్ భరత్ నగనఖలో నివసిస్తున్నాడు. గత కొన్నేళ్లుగా ఉప్పల్ డిపోలో శ్రీనివాస్ కండక్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే 5 నెలల క్రితం శ్రీనివాస్‌కి పక్షవాతం రావడంతో అందుకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు.


ఏం జరిగిందో తెలియదుగానీ శనివారం (జులై 19) రాత్రి ఒంటిగంటకు బయటకు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు బయలుదేరి వెళ్లిన శ్రీనివాస్ తిరిగి ఇంటికి రాలేదు. ఉప్పల్ బీరప్ప గడ్డ ఎస్సీ కమ్యూనిటీ హాల్లో చెట్టుకు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. గమనించిన స్థానికులు ఉప్పల్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనారోగ్య కారణాల వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Also read

Related posts

Share this