నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ అన్నారు.. ట్రైనింగ్ ఇచ్చి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇస్తామని నమ్మించారు.. లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. పోస్టింగ్ అంటూ చెప్పారు.. వర్క్ ఫ్రం హోమ్ అన్నారు.. చివరకు అందరినీ మోసం చేశారు.. హైదరాబాద్‌లో మరో కంపెనీ నిరుద్యోగులను సాఫ్ట్‌గా మోసం చేసింది.. ఉద్యోగాల పేరుతో లక్షలు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు..

వివరాల ప్రకారం.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మరో సాఫ్ట్‌వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ప్యూరోపాల్ క్రియేషన్ & ఐటీ సొల్యూ షన్స్ కంపెనీ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడింది. నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చి ఆపై ఉద్యోగాలు ఇస్తామంటూ వలవేసింది కంపెనీ. బాధితుల నుండి విడతల వారీగా ఒక్కొక్కరి నుంచి 2 నుండి రెండున్నర లక్షల రూపాయల వరకూ వసూలు చేశారు నిర్వాహకులు.. వీరి మాటలు నమ్మి దాదాపు 200 మంది యువకులు డబ్బులు కట్టి కంపెనీలో చేరారు.
అయితే.. కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ నమ్మించింది కంపెనీ యజమాన్యం.. చివరకు ట్రైనింగ్ ముగించిన తర్వాత కూడా ఎటువంటి ఉద్యోగం ఇవ్వకుండా కాలం గడుపుతూ వచ్చింది యాజమాన్యం.. దీంతో అనుమానం వచ్చిన అభ్యర్థులు గచ్చిబౌలి వచ్చి చూడగా అక్కడ ఎలాంటి ఆఫీసు కనిపించలేదు. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కంపెనీ బోర్డు తిప్పేయడంతో రోడ్డున పడ్డామని.. చర్యలు తీసుకోని తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను కోరారు.
ఈ ఘటనపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 200 మంది మోసపోయినట్లు పోలీసులు తెలిపారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025