ఫ్రెండ్స్‌తో కలిసి పబ్‌కి వెళ్లాడు. ఫుల్‌గా మద్యం సేవించాడు. అంతటితో ఆగలేదు. తిరిగి రూమ్‌కి వచ్చిన తర్వాత కూడా మద్యపానం కొనసాగించాడు. బాడీ మాత్రం ఎంతని తీసుకుంటుంది చెప్పండి. దీంతో వాంతులు స్టార్ట్ అయ్యాయి. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత….
దేనికైనా ఓ లిమిట్ ఉండాలి.. హద్దులు లేకుండా ఏం చేసినా పరిణామాలు తీవ్రంగానే ఉంటాయి. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతాయి. తాజాగా హైదరాబాద్‌లో అలాంటి ఘటనే వెలుగుచూసింది. అధికంగా మద్యం సేవించి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రాణాలు కోల్పోయాడు. హర్షవర్ధన్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. ఇద్దరు స్నేహితులతో ఆదివారం రాత్రి కొండాపూర్‌లోని క్వాక్ పబ్‌కు కలిసి వెళ్లాడు. అక్కడ ఫుల్‌గా మద్యం సేవించారు. అక్కడి నుంచి మళ్లీ తమ రూమ్‌కు వెళ్లారు. తర్వాత కూడా మద్యం తాగడం కొనసాగించారు. అయితే తెల్లవారుజామున అనూహ్యంగా హర్షవర్ధన్‌కు వాంతులు అయ్యాయి. దీంతో హుటాహుటిన ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హర్షవర్ధన్ మృతి చెందాడు. అధికంగా మద్యం సేవించడం వల్ల అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. హర్షవర్ధన్ స్వస్థలం విజయనగరం జిల్లా ప్రసాద్ నగర్ అని తెలిసింది. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హర్షవర్ధన్‌తో పాటు మిగిలిన ఇద్దరు స్నేహితులు కూడా సాఫ్ట్ వేర్ జాబ్ చేసేవాళ్లు. వారంతాల్లో సాఫ్ట్ వేర్ వాళ్లు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. లిమిట్‌లో ఉంటే తప్పు లేదు.. కానీ ఇప్పుడు చూడండి ఏమైందో. బాడీ మాత్రం ఎంతని తీసుకుంటుంది చెప్పండి. అందుకే పార్టీలు చేసుకునేవాళ్లు కాస్త హద్దుల్లో ఉంటే మంచిది. అతి ఎప్పుడూ ప్రమాదకరమే.
Also Read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్‌కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో