November 21, 2024
SGSTV NEWS
CrimeTelangana

సాధారణ తనిఖీలు.. ఓ కారులో కుప్పలుగా పార్శిళ్లు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్!

హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నోట్ల కట్టల కలకలం రేగింది. భారీ మొత్తంలో డబ్బు సీజ్ అయ్యింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మాదాపూర్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ కారులో పెద్ద మొత్తంలో డబ్బు కనిపించింది. కారులో 2కోట్ల 20లక్షల రూపాయల నగదు గుర్తించారు. జూబ్లీహిల్స్ నుండి మాదాపూర్ వైపు వెళ్తున్న కారులో డబ్బు ఉంది. సరైన ధ్రువపత్రాలు లేకుండా కారులో నగదు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాంతో డబ్బును సీజ్ చేశారు పోలీసులు. అలాగే కారులోని వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు మాదాపూర్ పోలీసులు.

ఎన్నికల వేళ పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడటం కలకలం రేపింది. ఆ డబ్బు ఎవరిది? ఎక్కడి నుంచి తెచ్చారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఈ వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. సరైన పత్రాలు లేకపోతే డబ్బును పోలీసులు సీజ్ చేస్తారు. కేసు నమోదు చేస్తారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేస్తున్నారు. రహదారులు, హైవేలపై చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని అడ్డుకోవడానికి పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ఎన్నికల అధికారులతో కలిసి ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు.

Also read


Related posts

Share via