February 1, 2025
SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: విల్లా రాణి అరెస్ట్.. విదేశాలకు పారిపోతుండగా పట్టుకున్న పోలీసులు.. అప్పుడే మరో ట్విస్ట్

ప్రభుత్వ భూములు కబ్జా చేయడం, అక్రమ నిర్మాణాలు చేపట్టడం, తప్పుడు డాక్యుమెంట్స్‌తో అమాయకులకు అంటగట్టడం.. ఇదీ ఆ లేడీ రియల్టర్‌ స్టైల్‌.. అలా.. అక్రమంగా విల్లాలు కట్టి ఏకంగా రూ.300 కోట్ల మోసానికి తెరలేపిన శ్రీలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్‌ యాజమాని గుర్రం విజయలక్ష్మిని దుండిగల్‌ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.


ప్రభుత్వ భూములు కబ్జా చేయడం, అక్రమ నిర్మాణాలు చేపట్టడం, తప్పుడు డాక్యుమెంట్స్‌తో అమాయకులకు అంటగట్టడం.. ఇదీ ఆ లేడీ రియల్టర్‌ స్టైల్‌.. అలా.. అక్రమంగా విల్లాలు కట్టి ఏకంగా రూ.300 కోట్ల మోసానికి తెరలేపిన శ్రీలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్‌ యాజమాని గుర్రం విజయలక్ష్మిని దుండిగల్‌ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. అక్రమ లేఅవుట్స్‌తో ప్రజలను మోసంచేసి కోట్ల రూపాయలు దోచేసిన రియల్టర్‌ గుర్రం విజయలక్ష్మి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి విదేశాలకు పారిపోతుండగా దుండిగల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టి.. రిమాండ్ కు తరలించారు.. దాంతో, తమకు న్యాయం చేయాలంటూ దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌కు క్యూకట్టారు బాధితులు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్రం విజయలక్ష్మిపై దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌లో అనేక కేసులు ఉన్నాయి. నిజాంపేట బాలాజీనగర్‌కు చెందిన గుర్రం విజయలక్ష్మి (48) శ్రీలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్, శ్రీలక్ష్మి మాగ్నస్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అండ్, భావన జీఎల్‌సీ క్రిబ్స్‌ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ప్రభుత్వ భూములను కబ్జా చేయడం, అక్రమ నిర్మాణాలు చేపట్టడం, తప్పుడు డాక్యుమెంట్స్‌తో అమాయకులకు అంటగట్టడం.. ప్రశ్నిస్తే బెదిరించడం.. గుర్రం విజయలక్ష్మి మోసాల స్టైల్‌. ఇలా.. దాదాపు రూ.300 కోట్ల వరకు మోసం చేసింది..

లక్ష్మీ శ్రీనివాస్‌ కన్‌స్ట్రక్షన్స్‌ పేరుతో దుండిగల్‌ మల్లంపేటలో విల్లాలు నిర్మించిన గుర్రం విజయలక్ష్మి.. ఎంతోమంది అమాయకులను ముంచేసింది. అయితే, ఆమె ఆటలు హైడ్రా రాకముందు వరకూ సాగాయ్‌. ఎప్పుడైతే హైడ్రా వచ్చిందో.. గుర్రం విజయలక్ష్మి భూకబ్జాలు, అక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతూ వచ్చాయి.. మల్లంపేట సర్వే నెంబర్‌ 170/3 నుంచి 170/5 వరకు అక్రమ విల్లాలు నిర్మించి ఆర్థిక నేరాలకు పాల్పడింది గుర్రం విజయలక్ష్మి. వీటిపై పెద్దఎత్తున ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపిన 11 విల్లాలను కూల్చేసింది హైడ్రా. అప్పట్నుంచి పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతోంది గుర్రం విజయలక్ష్మి.

అయితే.. దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌లో విజయలక్ష్మిపై 2021-2024 మధ్య 7 కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే.. బుధవారం అర్ధరాత్రి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించగా.. పాస్‌పోర్టు, వీసా తనిఖీ సమయంలో లుక్‌అవుట్‌ నోటీసు ఉన్నట్లు గుర్తించిన ఇమ్మిగ్రేషన్‌ అధికారులు దుండిగల్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని అరెస్టు చేశారు.. ఈ క్రమంలో నిందితురాలు గుండెపోట్లు వచ్చినట్లు నటించిందని పోలీసులు తెలిపారు. కాగా.. లేడీ రియల్టర్‌ పట్టుబడటంతో తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంటున్నారు బాధితులు

Also read

Related posts

Share via