హైదరాబాద్‌లో మరో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. బెంగాల్, బర్మా నుంచి యువతులను తీసుకొచ్చి ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలు ఏంటో.. ఈ స్టోరీలో చూసేద్దాం మరి. మీరూ ఓ సారి లుక్కేయండి
హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌లో పక్కా సమాచారంతో ఓ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. మొత్తం 11 మంది అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో నలుగురు బర్మా అమ్మాయిలు, ఏడుగురు యువకులున్నారు. తెలంగాణ స్పెషల్ సెల్ పోలీసులు, చాదర్ ఘాట్ పోలీసుల సంయుక్త దాడులలో వ్యభిచార ముఠాను పట్టుకున్నారు.
ఛాదర్ ఘాట్ లోని మూసానగర్ కేంద్రంగా గత కొంతకాలంగా గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విదేశీ అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు ముఠా సభ్యులు. పశ్చిమ బెంగాల్ తో పాటు బర్మా దేశంలోని బోర్డర్ నుంచి యువతులు, మైనర్ బాలికలను తీసుకువచ్చి ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. అయితే తెలంగాణ స్పెషల్ సెల్ పోలీసులు, చాదర్ ఘాట్ పోలీసులు ఈ ముఠా గుట్టు రట్టు చేశారు. మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ముఠా సభ్యుల్లో ఇద్దరు యువతులు, ఇద్దరు మైనర్ బాలికలు, ఏడుగురు యువకులు ఉన్నారు. ఇందులో యువతులు, మైనర్ బాలికలు బర్మా కు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు.
పాతబస్తీలో గత కొంత కాలంగా నిర్వహిస్తున్న వ్యభిచార ముఠాలపై ఓ కన్నేసి ఉంచారు పోలీసులు. పక్కా సమాచారం తెలుసుకుంటూ వారిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. తాజాగా చాదర్‌ఘాట్‌లోని మూసానగర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. తెలంగాణ స్పెషల్ సెల్ పోలీసులతో పాటు చాదర్‌ఘాట్ పోలీసులు మెరుపు దాడులు చేసి ఈ ముఠా సభ్యులను పట్టుకున్నారు. మొత్తం 11 మందిని అరెస్ట్ చేసి పోలీస్టేషన్‌కు తరలించారు. హైదరాబాద్‌లోని ఎక్కడ వ్యభిచారం నిర్వహించినా , కటకటాల వెనక్కి నెట్టేస్తామని పోలీసులు తెలిపారు. విదేశాల నుంచి యువతులను తీసుకొచ్చినా, మైనర్ అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు
Also read
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..
- పిల్లలను కారులో ఉంచి లాక్ చేయడంతో…కొంచమైతే ఎంతఘోరం జరిగేది?
- పోలీసోళ్లను పిచ్చోళ్లను చేసింది.. MMTSలో అత్యాచారయత్నం కేసులో బిగ్ ట్విస్ట్ !
- తిరుపతి అక్టోపస్ పోలీస్ కానిస్టేబుల్ దారుణ హత్య..మర్డర్ వెనుక సంచలన విషయాలు