హైదరాబాద్ నగరంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులపై రెచ్చిపోయాడు ఓ వ్యక్తి. దుర్భాషలాడుతూ దాడి చేసే ప్రయత్నం చేశాడు. సికింద్రాబాద్ బోయినపల్లిలో ఈ ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. బోయినపల్లిలో ట్రాఫిక్ పోలీసులు చెక్ పాయింట్ ఏర్పాటు చేసి.. వాహన తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల్లో భాగంగా బాపూజీ నగర్ నుంచి బోయినపల్లి క్రాస్ రోడ్ వైపుకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై వెళ్తున్న షోయబ్‌ను ట్రాఫిక్ పోలీసులు ఆపారు. బైక్ డాక్యూమెంట్స్, లైసన్స్ చూపించమని అడిగారు. దీంతో ఆ యువకుడు రెచ్చిపోయాడు.
బైకుకు ఫోకస్ లైట్లు ఉండటంతో.. చట్ట విరుద్దం అని యువకుడిని ట్రాఫిక్ పోలీసులు ప్రశ్నించారు. దీంతో షోయబ్ కోపంతో ఊగిపోయాడు. నా బైక్ ఆపుతారా, బండిపై చేయి తీయి అంటూ పోలీసులపై విరుచుకుపడ్డాడు. పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేసిన షోయబ్ మితిమీరి ప్రవర్తిస్తూ దాడి చేసేందుకు ప్రయత్నించాడని ట్రాఫిక్ ఎస్సై తెలిపారు. దీంతో బోయినపల్లి లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి షోయబ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే ట్రాఫిక్ పోలీసులే తనపై దాడి చేశారని షోయబ్ చెబుతున్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని అంటున్నాడు. పోలీసులే అన్యాయంగా ప్రవర్తించినట్లు చెబుతున్నాడు.
ఇటీవల పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. తాజ్ కృష్ణ హోటల్ నుంచి కేసీపీ వైపు వచ్చిన థార్ వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు ఆపారు. దీంతో ఆగ్రహానికి గురైన వాహన యజమాని అఫ్రజ్ ట్రాఫిక్ ఎస్ఐ మోజిరామ్‌పై చిందులేశాడు. దీంతో అతడిపై అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. విధుల్లో ఉన్న పోలీసులపై దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు
Also read
- తెలంగాణ: ఒక ఊరిలో నిత్యపూజలు.. మరో ఊరిలో కల్యాణం, బ్రహ్మోత్సవాలు.. ఈ రాములోరు చాలా స్పెషల్
- స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈ ముఠా ఏం చేశారో తెలుసుకుంటే షాక్..!.
- మ్యాట్రిమోనీ యాప్లో పరిచయమైన వ్యక్తిని నమ్మింది.. తన శీలాన్ని కోల్పోయింది..
- Weekly Horoscope: వారికి అధికార యోగం పట్టే అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు
- కిడ్నాప్ కేసులో ఆరుగురు అరెస్ట్..కార్లు, సెల్ ఫోన్లు, కత్తులు స్వాధీనం