July 7, 2024
SGSTV NEWS
CrimeTrending

Hyderabad: కూరగాయలు అమ్ముతూ.. ఇంటి ముందుకు వస్తాడు.. కానీ ఆ తర్వాతే అసలు యవ్వారం..!

హైదరాబాద్ మహానగరంలో మోస్ట్ వాంటెండ్‌ దొంగ చిక్కాడు. 10కి పైగా చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని బండ్లగూడ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 22 లక్షల విలువైన 29 తులాల బంగారం, కిలో వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బండ్లగూడలోని ఇస్మాయిల్‌నగర్‌లో నివాసం ఉంటున్న మహ్మద్‌ సలీమ్‌ అలియాస్‌ సునీల్‌ శెట్టి జీవనాధారం కోసం వాల్‌ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే అప్పుడప్పుడు సిటీలో పుష్‌ బండ్లపై కూరగాయలు విక్రయిస్తుంటాడు. ఇది కూడా పొట్ట కూటి కోసం అనుకునేరు. కాదండోయ్..! తాళం వేసిన ఇళ్లను గుర్తించేందుకు.. అవును అలాంటి ఇళ్లను కనిపెట్టి, ఆ తర్వాత యాక్షన్‌లోకి దిగిపోతాడు. ఇంట్లో డబ్బు, బంగారం, విలువైన వస్తువులు ఏవి కనిపించినా మాయం చేస్తాడు. తాజాగా ఇతగాడు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.

Also read :బంగారం లాంటి భవిష్యత్తు.. ఆ ఒక్క కారణంతో ఎంత పని చేశావు తల్లీ!
తాళం వేసి ఉన్న ఇళ్లను సలీమ్ గుర్తిస్తాడు. ఎవరూ లేని సమయంలో డోర్లు పగలగొట్టి, ఆ ఇళ్లలోకి చొరబడతాడు. అల్మారాల్లోని విలువైన వస్తువులను సేకరించి.. అక్కడి నుంచి పారిపోతాడు. నిందితుడికి గతంలో పెద్ద క్రైమ్ హిస్టరీ ఉందని టాస్క్ ఫోర్స్ అదనపు డిసిపి శ్రీనివాసరావు తెలిపారు. గతంలో నిందితుడు 150 కేసుల్లో చిక్కుకుని జైలుకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న సలీమ్.. జైలు శిక్ష కూడా అనుభవించాడు. 2023లో బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ చోరీలు చేయడం మొదలు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. తాజాగా మరోసారి అదుపులోకి తీసుకున్న పోలీసులు కటకటాలపాలు చేశారు.

Also read :తీరని విషాదం.. కవలలకు జన్మనిచ్చింది.. గంటల వ్యవధిలోనే

Related posts

Share via