బయట ఆడుకునేందుకు వెళ్లిన పిల్లలు ఎప్పుడు ఏదో ఒక తంట తెచ్చిపెడుతుంటరు. పక్కింట్లో వస్తువులు పాడు చేయడమో.. పిక్కింటి పిల్లలతో గొడవపడడమో చేస్తుంటారు. కొన్ని సార్లు వారి గొడవలు పెరిగి పెద్దల వరకు చేరుతాయి. తాజాగా ఇలాంటి ఘటనే మేడ్చల్ జిల్లాలో వెలుగు చూసింది. ఇద్దరు పిల్లల మధ్య జరిగిన గొడవ వాళ్ల తల్లిదండ్రుల వరకు చేరి.. రెండు కుటుంబాలు కొట్టుకునేవరకు వెళ్లింది. ఈ గొడవలో ఏకంగా ఒక పిల్లాడి తండ్రి ప్రాణమే పోయింది.
వివరాల్లోకి వెళ్తే.. అక్టోబర్ 5న మధ్యాహ్నం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఈ ఘటన వెలుగు చూసింది. ఘట్కేసర్ పరిధిలోని ఔషపూర్‌లో రెండు కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే ఆదివారం మధ్యాహ్నం.. ఆ రెండు కుంటుంబాలకు చెందిన ఇద్దరు గొడవ పడ్డారు. దీంతో అమీర్ అనే వ్యక్తి పిల్లలను మందలించాడు. దీంతో ఒక పిల్లాడు ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పాడు. దీంతో ఆవేశంతో ఊగిపోయిన అలీ అనే వ్యక్తి నా కొడుకునే మందలిస్తావా ? అని అమీర్ ఇంటికి వెళ్ళి మరీ దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో మాటామాట పెరిగి ఇరువురు పరస్పరం దాడి చేసుకున్నారు. గమనించిన స్థానికులు వాళ్లను అడ్డుకోవడంతో గొడవ సద్దుమణిగింది.
ఈ తతంగం జరిగిన కాసేపటికే అమీర్ తనకు చాతీలో నొప్పి వస్తుందని కుటుంబ సభ్యులకు చెప్పాడు. దీంతో కుటుంబసభ్యులు అమీర్‌ను వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. అయితే అక్కడ అమీర్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతని మృతి చెందినట్టు నిర్ధారించారు.దీంతో బాధిత కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విపలించారు.
వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేమాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అయితే అలీ దాడి చేయడం వల్లే అమీర్ మరణించాడా?, లేదా వేరే కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!