హైదరాబాద్ నగరంలోని కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఆదివారం రాత్రి ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.. రైలు దిగుతూ.. కిందపడిన యువకుడిని.. అక్కడున్న వారు రెప్పపాటులో కాపాడారు.. వరంగల్‌కు చెందిన సాదుల మణిదీప్ (31) బెంగళూరుకు వెళ్లేందుకు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు.
హైదరాబాద్ నగరంలోని కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఆదివారం రాత్రి ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.. రైలు దిగుతూ.. కిందపడిన యువకుడిని.. అక్కడున్న వారు రెప్పపాటులో కాపాడారు.. వరంగల్‌కు చెందిన సాదుల మణిదీప్ (31) బెంగళూరుకు వెళ్లేందుకు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. సాధారణ టికెట్ తీసుకున్న అతడు, రైలు వచ్చేసరికి గందరగోళంలో ఏసీ ఫస్ట్ క్లాస్ బోగీ హెచ్‌ఎ1 లో ఎక్కాడు.. కొద్ది సేపటికే తన పొరపాటు తెలుసుకున్న మణిదీప్, రైలు కదిలిపోతున్న సమయంలో కిందకు దిగేందుకు ప్రయత్నించాడు. ఆ క్షణంలోనే అతని కాలు జారింది.. దీంతో రైలు కిందపడే పరిస్థితి తలెత్తింది. అయితే అదృష్టవశాత్తు అక్కడే విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ (ఏసీఎం) గోవింద రావు, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సుస్మిత ఆ ఘటనను గమనించి వెంటనే స్పందించారు. చురుగ్గా స్పందించిన ఇద్దరూ మణిదీప్‌ను రైలు చక్రాల దగ్గర నుంచి పక్కకు లాగి ప్రాణాపాయం నుంచి రక్షించారు. క్షణాల్లో జరిగిపోయే ప్రమాదాన్ని పసిగట్టిన వీరి అప్రమత్తతను రైల్వే అధికారులు ప్రశంసించారు.
వీడియో చూడండి..
కాచిగూడ ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ వివరాల ప్రకారం.. మణిదీప్ ప్రాణాలు నిలిచింది పూర్తిగా రైల్వే సిబ్బందిలోని చాకచక్యంతోనని తెలిపారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ఇలాంటి నిర్లక్ష్యపు చర్యలకు పాల్పడకూడదని, రైలు నడుస్తున్న సమయంలో ఎక్కడం–దిగడం చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. రైల్వే సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించకపోయి ఉంటే ఈ ఘటనలో మణిదీప్ ప్రాణాలు కోల్పోయి ఉండేవాడని ఆయన తెలిపారు.
ప్రయాణికుల భద్రత కోసం రైల్వే అధికారులు తరచుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, ఇంకా కొందరు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని ఆర్పీఎఫ్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. రైలు ఎక్కే ముందు అన్ని వివరాలు చూసుకున్న తర్వాతనే సరైన ట్రైన్ ఎక్కాలని పాసింజర్లకు రైల్వే అధికారులు సూచిస్తున్నారు. రైల్లో ప్రయాణించేటప్పుడు సైతం జాగ్రత్తలు పాటించాలని వివరించారు.
Also read
- భార్యాభర్తల సెల్ఫీ వీడియో – ఆపై సూసైడ్ – భార్యాభర్తలిద్దరూ మృతి… వీడియో
- కురిక్యాల పాఠశాల ఘటనపై మహిళా కమిషన్ సీరియస్.. కఠిన చర్యలకు ఆదేశం!
- Jangaon District :విద్యర్థులందరు భోజనం చేశాక సాంబార్లో బల్లి ప్రత్యక్షం.. జనగామ జిల్లాలో ఘటన
- సినిమా రేంజ్ ట్విస్ట్.. భార్యను ఇంటికి పంపించి.. గుట్టుగా ఆ పని చేశాడు.. కట్ చేస్తే సీన్ ఇది
- Telangana: అంత చిన్న విషయానికే.. ఇంత దారుణమా.. అసలు ఏం జరిగిందంటే?





