SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: హైదరాబాద్‌లో ఒక్కసారిగా పేలిన టీవీలు, ఏసీలు.. కారణం ఏంటంటే?



సాధారణంగా ఒకదాని తర్వాత ఒకటి ఇంట్లో వస్తువు పేలిపోవడం చాలా వరకు మనం సినిమాల్లో చూస్తాం. హైదరాబాద్‌లోని ఒక కాలనీలో ఇలాంటి ఘటన నిజంగానే జరిగింది. కాలనీలో కొన్ని ఇళ్లలో ఉన్న టీవీ, ఏసీలు ఒకదాని వెంట మరోకటి పేలిపోయాయి. ఇంతకు అవి ఎలా పేలిపోయాలో తెలిస్తే.. మీరు షాక్ అవ్వాల్సిందే.


సాధారణంగా ఒకదాని తర్వాత ఒకటి ఇంట్లో వస్తువు పేలిపోవడం చాలా వరకు మనం సినిమాల్లో చూస్తాం. హైదరాబాద్‌లోని ఒక కాలనీలో ఇలాంటి ఘటన నిజంగానే జరిగింది. పండగ పూట కుటుంబ సభ్యులందరూ ఇంట్లో ప్రశాంతంగా టీవీ చూస్తూ కూర్చున్నారు. అంతో భారీ శబ్ధంతో వారు చూస్తున్న టీవీ పేలిపోయింది.. ఆ వెంటనే ఇంట్లో ఉన్న ఏసీ కూడా పేలిపోయింది. దీంతో కుటుంబ సభ్యులంతా షాక్ అయ్యారు. ఏం జరుగుతుందో తెలీక టెన్షన్ పడ్డారు.


ఇంతలో పక్కింటి నుంచి మరో భారీ శబ్ధం వచ్చింది. వాళ్ల ఇంట్లో కూడా టీవీ, ఏసీలు పేలిపోయాయి. ఇదంతా హైదరాబాద్ లోని సుచిత్ర ప్రాంతంలో వసంల్‌ విహార్‌ కాలనీలో చోటుచేసుకుంది. అలసు కాలనీలో ఏం జరుగుంది.. ఎందుకు టీవీ, ఏసీలు ఇలా పేలిపోతున్నాయో ఎవరికీ అర్థం కాలేదు.. వాళ్లందరూ హైవోల్టేజ్‌ కారణంగా ఇలా జరిగిందని అనుకన్నారు. వెంటనే ఇంట్లో ఉన్న మిగతా ఎలక్ట్రానిక్ వస్తువులను ఆఫ్‌ చేశారు. వాటి విద్యుత్‌ వైర్లను స్విచ్చుల నుంచి తొలగించారు.

ఇక ఘటనపై వెంటనే విద్యుత్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయినా ఈ విషయంపై అధికారులు ఎవరూ స్పందించలేదని బాధితులు ఆరోపించారు. అయితే కాసేపటి తర్వాత టీవీలు, ఏసీలు పేలిపోవడానికి గల కారణాన్ని వారు తెలుసుకున్నారు. ఇంట్లోని టీవీలు, ఏసీలు పేలిపోవడానికి లో , హై వోల్టేజ్ కారణం కాదని. విద్యుత్ స్తంభాలకు ఉన్న వైర్లు ఎర్త్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్టు నిర్దారించుకున్నారు

Also read

Related posts