అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. ఆకాశమంతా ఎత్తుకు వ్యాపించిన దట్టమైన పొగలు..!ఈ మంటల్లో పలువురు మహిళలు చిక్కుకున్నట్టుగా తెలిసింది. పెయింట్ డబ్బాలు పేలిపోవటంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. మంటలతో పాటు ఆకాశమంత ఎత్తున దట్టమైన పొగ కూడా అలుముకుంది. అక్కడివారంతా పొగతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. మంటల్లో చిక్కుకున్న మహిళను…
హైదరాబాద్ అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అంబర్‌పేట్‌లోని ఆలీ కేఫ్ వద్ద ఉన్న పెయింట్స్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో పలువురు మహిళలు చిక్కుకున్నట్టుగా తెలిసింది. పెయింట్ డబ్బాలు పేలిపోవటంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. మంటలతో పాటు ఆకాశమంత ఎత్తున దట్టమైన పొగ కూడా అలుముకుంది. అక్కడివారంతా పొగతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. మంటల్లో చిక్కుకున్న మహిళను… ఎలాగోలా రక్షించి వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సహాయక చర్యలు చేపట్టారు. ఫైరింజన్లతో మంటలను అదుపుచేశారు.
Also read
- హనుమాన్ జయంతిని ఏడాదిలో రెండు సార్లు ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
- ఆర్ధిక ఇబ్బందులా, జీవితంలో సమస్యలా హనుమాన్ జయంతి రోజున ఇంట్లో ఇలా పూజ చేయండి..
- హనుమంతుడికి ఇష్టమైన ఈ నైవేద్యం పెడితే మీ కోరికలు నెరవేరుతాయి..!
- సతీసమేత హనుమంతుడు..! తెలంగాణలో ఈ ప్రత్యేక ఆలయం
- Nellore: నెల్లూరు జిల్లాలో భర్త, అత్తమామల పైశాచికం.. కోడలిని వివస్త్రను చేసి హత్య!