నిండా 20 ఏళ్లు కూడా నిండా నిండని పిల్లలను పార్టీ పేరుతో ట్రాప్ చేసి, మత్తులో ముంచిన బద్మాష్ బాగోతం కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ చెర్రీ ఓక్స్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పార్టీలో మొత్తం 65 మంది పాల్గొన్నారు. వారిలో 59మంది స్టూడెంట్స్ ఉండగా అందర్ని ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ 59మంది విద్యార్థులో 22 మంది మైనర్లుగా గుర్తించారు. అందులో 5 అమ్మాయిలు ఉండగా, మరో 17 మంది అబ్బాయిలు ఉన్నారు. ఇన్‌స్టాలో పరిచయమైన వీరంతా జట్టుగా మారి మత్తు పార్టీ చేసుకున్నారు. హైదరాబాద్ చెర్రీ ఓక్స్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ ఘటనలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి..
మైనర్లపై మత్తు వల విసిరింది ఇషాన్ అనే యువకుడిగా పోలీసులు తెలిపారు.. ఇటీవలే కెనడా నుంచి హైదరాబాద్ వచ్చిన ఇషాన్.. పార్టీలకి అలవాటు పడి సెల్ఫ్‌గా పార్టీలను కండక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ట్రాప్ హౌస్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పేజ్ క్రియేట్ చేసి ఈ పార్టీ ఆర్గనైజ్ చేశాడు. ఇది మామూలు పార్టీ కాదని.. ఇక్కడకు వస్తే అంతులేని ఆనందాన్ని ఆస్వాదించవచ్చంటూ ఊరించాడు. ఇన్‌స్టాలో ఇది చూసిన మైనర్లు పార్టీకి హాజరైయ్యారు. వారంతా మత్తులో జోగుతున్న సమయంలో పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకున్నాకు.
ఫామ్‌హౌస్ యజమాని శేషగిరితోపాటు, ఆర్గనైజర్ ఇషాన్ సహా ఆరు గురిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. సూపర్వైజర్ ఠాకూర్ మనీష్, DJ ప్లేయర్లు రమేష్, రోహిత్.. మరో ఇద్దరు మైనర్లపై కూడా కేసు నమోదు చేశారు. పోలీసులు టెస్టులు చేయగా, ఇద్దరికి గంజాయి పాజిటివ్ అని తేలింది. 8 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు SOT పోలీసులు
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!