SGSTV NEWS
Telangana

Hyderabad: హైదరాబాద్‌లో నడిరోడ్డుపై వింత ఆసనం వేసిన యువకుడు.. రీజన్ ఏంటంటే..?



హైదరాబాద్ శేరిలింగంపల్లిలోని గుంతల రోడ్లపై నిరసనగా యాక్టివిస్ట్ వినయ్ వంగల వేసిన వింత ఆసనం నెట్టింట వైరల్ అయింది. దీంతో చివరికి జీహెచ్ఎంసీ స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టింది. ఆ డీటేల్స్ పూర్తి కథనంలో తెలుసుకుందాం పదండి .. .. ..

శేరిలింగంపల్లిలో రోడ్ల పరిస్థితి రోజురోజుకీ దారుణంగా మారుతోంది. పెద్ద పెద్ద గుంతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, అధికారులు పట్టించుకోకపోవడంతో ఒక యువకుడు వినూత్నంగా నిరసన తెలిపారు. వినయ్ వంగల అనే యాక్టివిస్ట్ ఒక పెద్ద గుంతపై యోగా ఆసనంలో నిల్చొని నిరసన తెలిపారు. ఈ నిరసనకు ఆయన ‘పోత్‌హోల్ ఆసన’ అని పేరు పెట్టారు. గుంతల వల్ల ప్రజలు ప్రతిరోజూ పడుతున్న ఇబ్బందులను ఆయన నిరసన ద్వారా చూపించారు.

“ఇక్కడి గుంతలపై రెండు నెలలుగా ఫిర్యాదులు చేస్తున్నా GHMC స్పందించలేదు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇందిరా, డిప్యూటీ ఇంజనీర్ శ్రీదేవి వంటి అధికారులపై సీరియస్‌గా చర్యలు తీసుకోవాలి,” అని వినయ్ డిమాండ్ చేశాడు.

GHMC చెప్పినట్టు 7,000 గుంతలు పూడ్చారేమో కానీ, శేరిలింగంపల్లిలో మాత్రం గుంతలు తగ్గకపోవడం బాధాకరం అని విమర్శించారు. #PotholeAsana హ్యాష్‌ట్యాగ్‌తో అతను ఈ విషయాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో.. చాలా మంది నెటిజన్స్ అతనికి మద్దతుగా పోస్ట్‌లు పెట్టారు. వినయ్ నిరసన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో చివరికి GHMC అధికారులు స్పందించి ఆ ప్రాంతంలో గుంతలు పూడ్చారు.


ఈ రోడ్లు వాహనాలే కాదు, మన ఆరోగ్యానికీ నష్టం చేస్తున్నాయని వినయ్ చెబుతున్నారు. రోజూ ఈ గుంతలపై వెళ్లేవారికి నడుము నొప్పులు రావడం జరుగుతుందని.. కొందరు ప్రమాదాలకు గురవుతున్నట్లు వెల్లడించాడు. ఎట్టకేలకు అతని నిరసన ఫలించి.. అక్కడి గుంతలు పూడాయి.

Also read



 

Related posts

Share this