హైదరాబాద్ నగరంలో అలజడి.. పిల్లలు ఇంటినుంచి బయటకు వెళితే, తిరిగి వస్తారా రారా అన్న టెన్షన్ కనిపిస్తోంది. అబిడ్స్‌లో మొన్న బాలికను ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి తీసుకెళ్లగా.. పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.. ఈ క్రమంలోనే.. ఓ బాలుడి మిస్సింగ్ సంచలనంగా మారింది..
హైదరాబాద్ నగరంలో అలజడి.. పిల్లలు ఇంటినుంచి బయటకు వెళితే, తిరిగి వస్తారా రారా అన్న టెన్షన్ కనిపిస్తోంది. అబిడ్స్‌లో మొన్న బాలికను ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి తీసుకెళ్లగా.. పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.. ఈ క్రమంలోనే.. ఓ బాలుడి మిస్సింగ్ సంచలనంగా మారింది.. హైదరాబాద్ నగరంలోని జిల్లెలగూడలో మహీధర్ రెడ్డి అనే బాలుడి మిస్సింగ్ కలకలం రేకెత్తిస్తోంది. 8వ తరగతి చదువుతోన్న మహీధర్‌రెడ్డి నిన్న ట్యూషన్‌కు వెళ్లాడు, కానీ తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు కలవరపడ్డారు. ఆచూకీ ఎక్కడ కూడా లభించకపోవడంతో.. మీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు బాలుడి ఆచూకీని ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
సీసీ టీవీ ఫుటేజ్‌లో బాలుడిని గుర్తుతెలియని వ్యక్తి బైక్‌పై తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో టూవీలర్ మీద తీసుకెళ్లిన వ్యక్తిని గుర్తించి పోలీసులు విచారించారు. తానూ కేవలం లిఫ్ట్ అడిగితే ఇచ్చానని చెప్పాడు.. బాలుడిని డ్రాప్ చేసిన ప్లేస్ కూడా పోలీసులకు చూపించాడు. దీంతో పోలీసులు అక్కడి సీసీ కెమెరాలను పరిశీలించారు.. బైక్ ఎక్కి, మీర్పేట్ క్రాస్ రోడ్డు వద్ద బాలుడు దిగినట్లు గుర్తించారు. సీసీ కెమెరాలో బాలుడు బైక్ నుండి దిగుతున్న దృశ్యాలను గుర్తించారు. మీర్పేట్ క్రాస్ రోడ్ నుంచి బాలుడు ఆచూకీ లభించలేదు.. దీంతో మున్సిపల్ ఆఫీస్ పరిసరాల్లో ఉన్న సిసి కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు..
అయితే.. మరి బాలుడు ఏమైయ్యాడు? జిల్లెలగూడ పరిసరాల్లోని అన్ని సీసీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. టిల్లు, అలియాస్ మహీధర్‌రెడ్డి కోసం జల్లెడ పడుతున్నారు.
నిన్న మధ్యాహ్నం ట్యూషన్‌కి వెళ్లిన మహీధర్‌రెడ్డి ఆచూకీ ఇప్పటివరకూ తెలియకపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం