December 12, 2024
SGSTV NEWS
CrimeTelangana

తప్పతాగి.. అన్యాయంగా చంపేశావ్ కదరా..! రోడ్డు మీదకు రావాలంటేనే భయమేస్తుంది..

డ్రంకన్‌ డ్రైవ్‌కి మరో ఇద్దరు బలైపోయారు. మందుబాబు నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసాయి. హైదరాబాద్‌ లంగర్‌హౌస్‌ ప్రమాదంలో భార్యాభర్తలిద్దరు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.


తప్పతాగి డ్రైవింగ్‌ చేస్తే.. ప్రాణాలు పోతున్నాయి. మత్తులో చిత్తయి యాక్సిడెంట్‌ చేస్తే.. ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాల పరిస్థితి ఏంటి..? హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ తాగుబోతు సృష్టించిన బీభత్సానికి ఇద్దరు చిన్నారులు.. తల్లిదండ్రులను కోల్పోయారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌ లంగర్‌హౌస్‌లో శనివారం రాత్రి జరిగింది. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను చూస్తుంటే కంటనీరు ఆగడంలేదు..

అసలేం జరిగిందంటే..
శనివారం రాత్రి.. హైదరాబాద్ లంగర్ హౌస్‌లో కారు బీభత్సం సృష్టించింది. అటుగా వెళ్తున్న టూ వీలర్‌తో పాటు ఆటోను ఢీ కొట్టింది. దీంతో బైక్ పై ఉన్న దంపతులిద్దరూ స్పాట్లోనే చనిపోయారు. ఆటోలో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి.

అయితే.. దంపతులు దినేష్ గోస్వామి (35), మోనా ఠాకూర్ (33) గుర్తించారు. మోనా గర్భవతి అని పేర్కొంటున్నారు. అయితే, యాక్సిడెంట్ కు కారణం కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమేనని పోలీసులు నిర్ధారించారు. కారు డ్రైవర్ ప్రణయ్ వికారాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.


సమాచారం అందుకున్న పోలీసులు .. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో పలువురు పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్టు పేర్కొంటున్నారు.

అనాథలైన చిన్నారులు..
తల్లిదండ్రులు దినేష్ గోస్వామి, మోనా ఠాకూర్ మృతితో ఆ ఇద్దరు చిన్నారులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. తమ తల్లిదండ్రుల ప్రాణాలు తీసినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు చిన్నారులు ప్రేరణశ్రీ, ధృతిశ్రీ

Also read

Related posts

Share via