SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: హైదరాబాద్‌ శివారులో దారుణ ఘటన.. 2019 నాటి దిశను పోలిన హత్య

మునీరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ORR) వద్ద వివాహిత (25) దారుణహత్యకు గురైంది. దుండగులు. ORR బైపాస్ అండర్ బ్రిడ్జి కింద మహిళను బండరాయితో కొట్టి పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకొన్న మేడ్చల్‌ పోలీసులు, క్లూస్‌ టీమ్‌ ఆధారాలు సేకరిస్తున్నారు.


2019లో షాద్‌నగర్‌ సమీపంలో జరిగిన దిశ ఘటన గుర్తుందా. కొందరు వ్యక్తులు ఓ వెటర్నరీ డాక్టర్‌ని అత్యాచారం చేసి, ఆపై హత్య చేశారు. పెట్రోల్‌ పోసి డెడ్‌బాడీని తగలపెట్టారు. ఆ ఘటన ఇప్పటికీ తెలుగురాష్ట్రాల్లో ఓ కలవరమే. సేమ్ అలాంటి ఘటనే ఇప్పుడు మేడ్చల్‌ జిల్లా మునీరాబాద్‌ ORR సమీపంలో కనిపిస్తోంది. ఇది అత్యాచార ఘటనా, హత్య ఘటనా.. లేదంటే రెండూనా? పక్కాగా ఇప్పుడే కన్‌ఫామ్ చెయ్యలేం గానీ.. ఘటన మాత్రం దిశను పోలి కనిపిస్తోంది. ప్రస్తుతం పోలీస్ ఎంక్వైరీ జరుగుతోంది.


ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో నిర్మానుష్య ప్రదేశం. రింగ్ రోడ్డుపై నుంచి వాహనాలు వెళ్తుంటాయి కాని.. కింద మనుషుల సంచారం లేదు. అక్కడ డెడ్‌బాడీ పోలీసులను పరుగులు పెట్టిస్తోంది. హంతకులు ఎవరు? మృతురాలు ఎవరు అని అంతుతేల్చే పనిలో ఉన్నారు పోలీసులు.

ఈ యువతి హత్య రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో మునీరాబాద్ దగ్గర యువతి డెడ్‌బాడీ కనిపించింది బండరాళ్లతో కొట్టి చంపినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఆపై పెట్రోల్ పోసి తగలబెట్టారు దుండగులు. యువతి వివాహిత, వయస్సు 25 సంవత్సరాలుగా ఉన్నట్లు తెలుస్తోంది. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. డెడ్‌బాడీ ఎవరిది? దుశ్చర్యకు పాల్పడింది ఎవరు అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.


“ఔటర్ రింగ్ రోడ్డు కింద అండర్ బ్రిడ్జ్ కింద ఒక వివాహిత హత్యకు గురైంది.  మధ్యాహ్నం 3 గంటలకి మాకు సమాచారం అందింది. ఆమె మొహంపై బండరాయితో మోది, పెట్రోల్ పోసి నిప్పు పెట్టి తగలబెట్టారు. వయసు 25 నుండి 30 సంవత్సరాలు ఉంటుంది.  గుర్తుపట్టలేనంతగా కాల్చేశారు. ఎక్కడైనా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయేమో పరిశీలిస్తున్నాము. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే అత్యాచారం జరిగిందో లేదో తెలుస్తుంది” అని మేడ్చల్ ఏసిపి శ్రీనివాస్ తెలిపారు

Also Read

Related posts