SGSTV NEWS
CrimeTelangana

ఇంత వైలెంట్‌గా ఉన్నారేంట్రా.. ఇద్దరి గొడవ మధ్యలో వేలు పెట్టింది.. కట్ చేస్తే..

చిన్న చిట్టీ డబ్బుల వ్యవహారం పెద్ద విషాదానికి దారి తీసింది. మాటామాట పెరిగి ఒకరు చూపుడు వేలిని పోగొట్టుకోగా, నిందితుడు జైలు పాలు కావాల్సి వచ్చిన ఘటన హైదరాబాద్‌లోని మధురానగర్‌లో చోటుచేసుకుంది. జవహర్నగర్‌కు చెందిన మమత అనే మహిళ.. అక్కడి మూడేళ్ల నుంచి ఓ అపార్ట్మెంట్పెంట్‌హౌస్‌లో అద్దెకు నివసిస్తోంది. అయితే.. ఇంటి యజమానురాలు సుజిత చిట్టీలు వేస్తుండేంది. ఆమె దగ్గర మమత కూడా చిట్టీలు వేస్తూ వచ్చింది.. ఈ చిట్టీల వ్యవహారంలో ఇంటి యజమానురాలు సుజిత.. మమతకు రూ.30 వేలు చెల్లించాల్సి ఉంది. ఇటీవల మమత ఇల్లు ఖాళీ చేసి తన స్నేహితురాలు సుప్రియకి అప్పగించింది.

అయితే, సుప్రియ ఇంటిని ఖాళీ చేయడంతో సుజితకు అద్దె విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. ఇదిలా ఉండగా.. తమకు చెల్లించాల్సిన డబ్బుల విషయమై మమత ఆమె భర్త హేమంత్సుజిత దగ్గరకు వెళ్లి డబ్బులు అడిగారు. దీంతో సుప్రియ ఇంటి అద్దె చెల్లించకుండా వెళ్లిందని.. అద్దె డబ్బు మీరే ఇవ్వాలంటూ సుజిత పట్టుబట్టింది. వారి మధ్య మాటామాట పెరిగింది. ఈ క్రమంలో చూస్తుండగానే గొడవ పెద్దదిగా మారింది.

అయితే.. వాళ్ల గొడవ మధ్యలో సుజిత తల్లి.. లత జోక్యం చేసుకోంది.. ఈ క్రమంలో.. హేమంత్కోపంతో.. ఆమె కుడిచేతి చూపుడు వేలిని గట్టిగా కొరికేశాడు. దీంతో లత చూపుడు వేలు ఊడి కింద పడిపోయింది. అనంతరం ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ వైద్యులు ఆ వేలు తిరిగి అతికించలేమని చెప్పారు. దీంతో బాధితురాలు లబోదిబోమంటూ తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది.. సుజిత ఫిర్యాదు మేరకు మధురానగర్పోలీసులు హేమంత్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది

Also read

Related posts

Share this