విరన్ జైన్ అనే బాలుడు సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. రోజూ మాదిరిగానే స్కూల్‌కి వెళ్లిన బాలుడు లంచ్‌టైమ్‌లో ఇంటి నుండి తెచ్చుకున్న చపాతీ తింటున్నాడు..ఈ క్రమంలోనే చపాతీ రోల్ బాలుడి గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడక అవస్థపడ్డాడు.
గొంతులో చేప ముల్లు, కోడిగుడ్డు, మటన్ బొక్కలు ఇరుక్కుని పలువురు మృతి చెందిన ఘటనలు అనేకం చూశాం. అయితే, ఓ 12ఏళ్ల బాలుడు గొంతులో చపాతీ ఇరుక్కుని మృతి చెందిన విషాద సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. విరన్ జైన్ అనే బాలుడు సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. రోజూ మాదిరిగానే స్కూల్‌కి వెళ్లిన బాలుడు లంచ్‌టైమ్‌లో ఇంటి నుండి తెచ్చుకున్న చపాతీ తింటున్నాడు..ఈ క్రమంలోనే చపాతీ రోల్ బాలుడి గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడక అవస్థపడ్డాడు.
బాలుడి అవస్థ చూసిన తోటి విద్యార్థులు వెంటనే టీచర్లు, సిబ్బందికి తెలియజేశారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి మృతితో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
Also read
- Telangana: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. గన్‌తో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు..
- Watch Video: సర్కార్ బడి టీచరమ్మ వేషాలు చూశారా? బాలికలతో కాళ్లు నొక్కించుకుంటూ ఫోన్లో బాతాఖానీ! వీడియో
- ప్రైవేటు స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగికదాడి!
- నేటి జాతకములు…5 నవంబర్, 2025
- అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?





